Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు 20 సీట్లకు మించి రావు- బండి సంజయ్ జోస్యం

సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే. పీజీలు చేసినా ఉద్యోగాల్లేక అమెరికా, దుబాయ్ హోటళ్లలో కూలీలుగా పనిచేస్తున్నారు. Bandi Sanjay - CM KCR

Bandi Sanjay – CM KCR : తెలంగాణలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అధికార, విపక్షాల నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు మాటల యుద్ధానికి దిగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ నేత బండి సంజయ్ నిప్పులు చెరుగుతున్నారు. జమిలి అంటే అంత జంకెందుకు? అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. మోదీ ఛరిష్మా సునామీలో కేసీఆర్ కొట్టుకపోవడం ఖాయం అని చెప్పారు. దేశద్రోహుల పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ జాతీయ సమైక్యతా రాగం అందుకున్నారని ధ్వజమెత్తారు.

”పబ్లిక్ గార్డెన్ లో కాదు.. దారుస్సలాంలో ఉత్సవాలు జరుపుకోండి. కేసీఆర్ పాలనలో మంత్రులంతా డమ్మీలే. సలహాదారులే మంత్రులకంటే పవర్ ఫుల్. నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్. రిటైర్ అయిన ఇతర రాష్ట్రాల అధికారులకు కోట్ల జీతాలతో సలహాదారుల పదవులా? 22లక్షల మంది కౌలు రైతులకు నయాపైసా సాయం అందడం లేదు.

Also Read..Mulug Constituency: అడవి బిడ్డల ఆసక్తికర పోరు.. ములుగులో ఎవరిదో పైచేయి?

సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే. పీజీలు చేసినా ఉద్యోగాల్లేక అమెరికా, దుబాయ్ హోటళ్లలో కూలీలుగా పనిచేస్తున్నారు. రిటైర్ అయితే బెనిఫిట్స్ ఇచ్చే స్తోమత లేక ఉద్యోగ విరమణ వయసు పెంచే దుస్థితికి కేసీఆర్ చేరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు 20 సీట్లకు మించి రావు. కాంగ్రెస్ లో గెలిచినోళ్లంతా వెళ్లేది బీఆర్ఎస్ లోకే. యువకులారా.. ఇంట్లో కూర్చుంటే రాష్ట్రం మరింత అథో:గతే. తెలంగాణ బలిదానాల స్ఫూర్తితో కేసీఆర్ ను గద్దె దించేదాక పోరాడదాం రండి. కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే” అని బండి సంజయ్ అన్నారు.

Also Read..BJP: రఘునందన్‌రావు తప్ప.. ఎక్కడా కనిపించని హేమాహేమీల పేర్లు!

ట్రెండింగ్ వార్తలు