TSRTC : దసరా పండుగ, ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవ్

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న ఎండీ సజ్జనార్ అదనపు బస్సులు నడుపుతున్నామన్నారు. ప్రయాణీకులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయన్నారు.

TSRTC MD Sajjanar : దసరా, సంక్రాంతి పండుగలు వచ్చిందంటే చాలు స్వగ్రామాలకు వెళ్లే వారు భయపడిపోతుంటారు. ఎందుకంటే…బస్సుల్లో ఎంత బాదుడు బాదుతారో అని ఆందోళన చెందుతుంటారు. చాలా మంది ప్రైవేటు వాహనాల వైపు మొగ్గు చూపుతుంటారు. దసరా పండుగ 15వ తేద కావడంతో…ఇప్పటి నుంచే స్వగ్రామాలకు వెళ్లేందుకు..సిద్ధమౌతున్నారు. బస్టాండులు కూడా కిటకిటలాడుతున్నాయి.

Read More  :AP Coal : విద్యుత్ సంక్షోభం, ఆ సమయంలో…ఏసీలు ఆపేయండి

ఈ క్రమంలో..నూతనంగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న ఎండీ సజ్జనార్ అదనపు బస్సులు నడుపుతున్నామన్నారు. అదనంగా తిరిగే బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తుండే వారు. దీంతో చాలా మంది బాదుడు భరించలేక ఇతర మార్గాల వైపు మొగ్గు చూపేవారు. ఈ క్రమంలో..ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయమని, ప్రయాణీకుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా సంస్థ పని చేస్తుందని తీపి కబురు అందించారు.

Read More  : Evaru Meelo Koteeswarulu : డబ్బులు కావాలంటున్న సమంత..

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీస్తూ..ప్రయాణీకులు చూపించే ఆరాభిమానాలే సంస్థ పురోభావృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయన్నారు. అందరూ ప్రతి ప్రయాణాన్ని ఆర్టీస బస్సులో చేసి..సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు. గత ఐదు రోజుల్లో 1.30 కోట్ల మంది ప్రయాణీకులను టీఎస్ ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు