Vijay Deverakonda : విజయ్ దేవరకొండ పుట్టిన రోజు.. ఒకే రోజు మూడు పాన్ ఇండియా సినిమాలు.. అప్డేట్స్ అదిరిపోయాయిగా..

విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నాడు మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడం, అవన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Vijay Deverakonda : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి నేడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తన సినిమాలతో, తన మాటలతో అభిమానులని, ప్రేక్షకులని సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు. విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు.

నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో విజయ్ నుచి రాబోయే సినిమాల అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఫుల్ ఫిదా చేశారు. ఏకంగా ఒకే రోజు మూడు పాన్ ఇండియా సినిమాల అప్డేట్స్ ఇచ్చాడు విజయ్. తన నెక్స్ట్ మూడు సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నాయి. దేనికదే కొత్త కొత్త కథలతో రాబోతున్నాయి. ఈ అప్డేట్స్ తో విజయ్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో విజయ్ సినిమాల అప్డేట్స్ వైరల్ గా మారాయి.

Also Read : VD14 Update : అదిరిపోయిన VD14 అప్డేట్.. 1850వ సంవత్సరంలో కథతో.. యోధుడిగా విజయ్ దేవరకొండ..

సితార ఎంటర్టైన్మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ పీరియాడిక్ స్పై యాక్షన్ కథతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. VD12 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మూవీ యూనిట్ అప్డేట్ ఇస్తూ.. వైజాగ్ లో ఈ సినిమాలోని ఓ అదిరిపోయే మాసివ్ సీన్స్ ని షూట్ చేస్తున్నట్టు, త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో 59వ సినిమాగా రాజావారు రాణిగారు సినిమా ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూరల్ యాక్షన్ డ్రామా కథతో సినిమాని ప్రకటించారు. తాజాగా కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. అంటూ రక్తంతో తడిచిన చేయి ఓ కత్తిని పట్టుకొని ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు.

ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మెప్పించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా VD14 వర్కింగ్ టైటిల్ తో ప్రకటిస్తూ ఓ ఆసక్తికర పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని, 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ తో తెలిపారు.

దీంతో ఒకే రోజు, అది కూడా విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నాడు మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడం, అవన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు