×
Ad

MaayaOne Teaser : సందీప్ కిషన్ మాయావన్ టీజర్ రిలీజ్.. సైన్స్ ఫిక్షన్ కథతో.. అదిరిపోయే విజువల్స్‌తో..

తాజాగా నేడు సందీప్ కిషన్ మాయావన్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

  • Published On : May 9, 2024 / 12:57 PM IST

Sundeep Kishan MaayaOne Teaser Released

MaayaOne Teaser : సందీప్ కిషన్(Sundeep Kishan) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఊరుపేరు భైరవకోన సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు సందీప్. ప్రస్తుతం సందీప్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. గతంలో సందీప్ కిషన్ హీరోగా తమిళ్ దర్శకుడు CV కుమార్ దర్శకత్వంలో మాయావన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాని తెలుగులో ప్రాజెక్ట్ Z గా రిలీజ్ చేశారు.

ఇటీవల ఈ మాయావన్ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. CV కుమార్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా అనిల్ సుంకర నిర్మాతగా AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మాయావన్ సీక్వెల్ ప్రకటించి పూజా కార్యక్రమాలు చేసి షూటింగ్ కూడా మొదలుపెట్టేసారు. ఈ సీక్వెల్ కి కూడా మాయావన్ అనే టైటిల్ ప్రకటించడం గమనార్హం. అయితే టైటిల్ లో మాత్రం డిజైన్ ఛేంజ్ చేశారు. తాజాగా నేడు ఈ మాయావన్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ పుట్టిన రోజు.. ఒకే రోజు మూడు పాన్ ఇండియా సినిమాలు.. అప్డేట్స్ అదిరిపోయాయిగా..

టీజర్ మొత్తం సైన్స్ ఫిక్షన్ గానే సాగింది. టీజర్లో మురళీ శర్మ.. ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూస్తే తనని తాను దేవుడిగా భావించిన ప్రతి మనిషి మారింది రాక్షసుడిగా మాత్రమే. అలాంటి రాక్షసుడు వచ్చిన ప్రతిసారి ఆ దేవుడు పంపేది మొండితనాన్ని ఆయుధంగా మార్చుకొని పోరాడే ఓ సామాన్యుడిని లాంటి పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు. సైన్స్ తో ప్రపంచాన్ని శాషించాలనుకునే ఓ విలన్, దాన్ని ఎదుర్కునే హీరో అనే కథాంశంతో ఈ మాయావన్ ఉండబోతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఈ మాయావన్ సినిమాపై ఆసక్తి నెలకొంది. మాయావన్ టీజర్ మీరు కూడా చూసేయండి..