Mayookha : థ్రిల్లర్ సినిమా ‘మయూఖ’ 25 డేస్ సక్సెస్ మీట్..
తాజాగా మయూఖ సినిమా 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. (Mayookha)
Mayookha
Mayookha : పాయల్ చెంగప్ప మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మయూఖ సినిమా ఇటీవల అక్టోబర్ 9న థియేటర్స్ లో రిలీజయింది. బిగ్ బాస్ ఫేమ్ అమన్, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిశ్మ దబ్బార, జాను వర్మ.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మాణంలో శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వంలో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా మయూఖ సినిమా 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్ గెస్ట్ గా హాజరయ్యారు.
మయూఖ సక్సెస్ మీట్ లో హీరోయిన్ పాయల్ చెంగప్ప మాట్లాడుతూ.. తెలుగులో నాకు ఇది ఫస్ట్ మూవీ. మా టీమ్ కూడా కొత్త వాళ్లే. ఇలాంటి టీమ్ కు సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. ఈ రోజు మా సినిమా 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మిస్టరీ మూవీ అవార్డ్ గెల్చుకుంది. మా డైరెక్టర్ కు కూడా అవార్డ్స్ వచ్చాయి అని తెలిపారు.
Also See : Nayanthara : ‘మహాశక్తి’ రిలీజ్ కి ముందు.. పూజ గది నుంచి డివోషనల్ వైబ్ ఫోటోలు షేర్ చేసిన నయనతార..
నిర్మాత శశిధర్ నల్ల మాట్లాడుతూ.. థియేటర్స్ దగ్గర పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు నిలబడని పరిస్థితిలో మా సినిమా థియేట్రికల్ గా 25 రోజులు సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతుండటం సంతోషంగా ఉంది. మంచి స్క్రిప్ట్, ప్లానింగ్, కష్టపడే టీమ్ ఉంటే మయూఖ లాంటి విజయం ఏ ప్రొడ్యూసర్ అయినా సాధించవచ్చు అని అన్నారు. దర్శకుడు శ్రీతేజ్ ఎస్.కె. మాట్లాడుతూ.. నేను హనుమాన్ మాలలో ఉండే ఈ సినిమా ప్రమోషన్స్ చేశాను. ఆయన శక్తే మా సినిమాను ముందుకు నడిపించిందని నమ్ముతున్నాను. నిన్న 25 డే మా టీమ్ థియేటర్స్ కు వెళ్లారు. దాదాపు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది. మా మూవీని ప్రేక్షకులు జెన్యూన్ గా ఆదరిస్తున్నారు. మాది చిన్న సినిమా అని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ అభిరుచి గల ఆడియెన్స్ సక్సెస్ చేశారు అని అన్నారు.
పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. మేము ఎన్నో ఏళ్లుగా చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలుస్తున్నాము. డైరెక్టర్ శ్రీతేజ్, ప్రొడ్యూసర్ శశిధర్ నాకు చాలాకాలంగా తెలుసు. మీ టీమ్ ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలి. మీ టీమ్ కు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరకు రావొచ్చు. చిన్న చిత్రాలకు ప్రభుత్వం తరుపున కూడా సపోర్ట్ అందేలా చేస్తాం అని అన్నారు.
