Anupama Parameswaran : ఫ్యాన్ ఎడిట్ చేసిన ఫోటో అనుపమ లైఫ్ నే మార్చేసింది.. చాలా కష్ట సమయంలో అది చూడగానే..
తాజాగా అనుపమ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. (Anupama Parameswaran)
Anupama Parameswaran
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే లవ్ బ్రేకప్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ బిజీగా సినిమాలు చేస్తుంది. కొన్ని రోజల క్రితమే క్రేజీ కళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. తాజాగా అనుపమ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.
ఇంటర్వ్యూలో అనుపమ ఫోన్ వాల్ పేపర్ చూపెట్టమని అడగ్గా ఆమె చూపించింది. దాంతో తన వాల్ పేపర్ చూపించింది. ఇప్పటి అనుపమ, చిన్నప్పటి అనుపమను హగ్ చేసుకున్నట్టు ఉన్న ఫోటోని తన వాల్ పేపర్ గా పెట్టుకుంది ఈ మలయాళ కుట్టి.
Also Read : Vijay : విజయ్ సినిమాతో ఆగిపోయింది.. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం పర్మిషన్ తో మొదలు..
ఈ ఫోటో గురించి అనుపమ మాట్లాడుతూ.. ఇది ఎవరు ఎడిట్ చేసారో నాకు తెలీదు. ఇలా ఎడిట్ చేసి ఓ ఫ్యాన్ నన్ను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసిన పిక్చర్ ఇది. ఈ ఫొటోలో ఉన్నది నేను, చిన్నప్పటి నేను. ఈ ఫోటో నా జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో చూసాను. ఈ ఫోటోని చూడటం వల్లే అక్కడ్నుంచి ఫ్లిప్ అయి నా లైఫ్ లోకి తిరిగొచ్చాను. ఓకే బ్యాడ్ డే రోజు ఏం చేయాలో తెలియకుండా కూర్చొని ఉన్న సమయంలో ఈ ఫోటో కనిపించింది. ఈ ఫోటోని ప్రింట్ తీసి నాకు ఎదురుగా మిర్రర్ కి పెట్టుకున్నాను. ఆ ఫోటో చూసి ఈ చిన్న పాపని హర్ట్ అవ్వడానికి అనుమతించాను. ఇంక ఈ పాపని హర్ట్ చేయకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. ఈ ఫోటో చూడటం వల్లే నా లైఫ్ మారింది అని తెలిపింది.

