Nandikottur Election Result : కూటమికి బిగ్‌షాక్.. నందికొట్కూరులో వైసీపీ హవా.. ఫలించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యూహం..!
Nandikottur Election Result : నంద్యాల జిల్లా నందికొట్టూరు మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.
AP Muncipal Elections Results
Nandikottur Election Result : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రం మొత్తం కూటమి హవా కొనసాగుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయదుందభి మోగిస్తున్నారు. అయితే, కూటమి ఎదురుగాలిని తట్టుకొని నందికొట్కూరులో వైసీపీ హవా కొనసాగించింది. దీనికి కారణంగా ఏంటా అంటే.. నందికొట్కూరులో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యూహమేనని చర్చ జరుగుతుంది. రాష్ట్రం మొత్తం ఫలితాల్లో వైసీపీ చతికలబడుతుంటే నందికొట్కూరులో మాత్రం వైసీపీ హవా కొనసాగడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులకుగాను, ఏకంగా 23కిపైగా వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ మున్సిపాలిటీలో వైసీపీ విజయానికి యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యూహమే కారణమని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మొదలుకొని ప్రతి అడుగులోనూ కేడర్ ను ముందుండి నడిపిస్తూ స్థానిక రాజకీయాలను సమన్వయం చేసిన ఆయన వ్యూహం ఈ ఎన్నికల్లో మరోసారి సక్సెస్ అయింది. ఈ ఫలితాలతో నందికొట్కూరు గడ్డపై పార్టీ పట్టు నిరూపితమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
