Vijay : విజయ్ సినిమాతో ఆగిపోయింది.. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం పర్మిషన్ తో మొదలు..
తాజాగా థియేటర్స్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. (Vijay)
Vijay
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళనాడు సీఎం అయిన సంగతి తెలిసిందే. సీఎం అయ్యాక సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలని వచ్చినా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా థియేటర్స్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో 2023 సంక్రాంతికి అజిత్ ‘తునివు’, విజయ్ ‘వారిసు’ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అంటే సందడి మాములుగా ఉండదు కదా. ఉదయం షోలకు కూడా పర్మిషన్స్ రావడంతో తెల్లవారుజాము నుంచే థియేటర్స్ వద్ద అభిమానులు భారీగా గుమిగూడారు. ఈ క్రమంలో ఓ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 ఏళ్ల ఓ అభిమాని మరణించారు.
Also Read : Divi : గోవాలో నటి దివి.. ఫోటోలు వైరల్..
ఆ ఘటనతో అప్పటి తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం అర్ధరాత్రి షోలు, ఉదయం 4, 5 గంటల ఫ్యాన్స్ షోలను పూర్తిగా రద్దు చేసింది. అప్పట్నుంచి తమిళనాడులో తమిళనాట మిడ్-నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు లేవు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఉదయం 9 గంటల నుంచే థియేటర్స్ లో వేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి రాబోతుంది.
థియేటర్ యజమానుల అసోసియేషన్, ఫిల్మ్ ఛాంబర్ గత కొంతకాలంగా స్టార్ హీరోల సినిమాల వరకు అయినా ఎర్లీ మార్నింగ్ షోలకు పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సూర్య సీన్ సినిమాకు కూడా పర్మిషన్ అడిగారు. దీంతో విజయ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉదయం 4 గంటల షోలకు కాకపోయినా ఉదయం 6 గంటల నుంచి షోలు వేసుకోవడానికి అనుమతులు ఇవ్వడానికి విజయ్ ప్రభుత్వం రెడీ అవుతుందని సమాచారం.
