East Godavari Election Results: తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఘోర పరాభవం.. కూటమి క్లీన్ స్వీప్
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తూర్పుగోదావరి (East Godavari Election Results)జిల్లా వ్యాప్తంగా ఎన్డీయే కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయగా, వైసీపీ ఘోర పరాజయం ఎదురయ్యింది.
Ap municipal election results nda alliance sweeps east godavari ysrcp wiped out mandapeta kovvur nidadavole
East Godavari Election Results: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థులు అపూర్వ విజయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఫలితాల్లో ప్రతిపక్ష వైసీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోగా, కూటమి ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 96 కౌన్సిలర్ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగగా వైకాపా(East Godavari Election Results) అభ్యర్థులు కేవలం మూడు స్థానాలకే పరిమితం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మండపేట పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 36 వార్డులను కూటమి అభ్యర్థులే క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించారు.
కొవ్వూరు, నిడదవోలులో కూటమి విజయం.. మూడు సీట్లకు పరిమితమైన వైసీపీ!
కొవ్వూరు మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను ఏకంగా 27 చోట్ల ఎన్డీయే కూటమి విజయం సాధించగా, మిగిలిన ఒక్క స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మరోవైపు నిడదవోలులోని 32 వార్డుల్లో జనసేన 14, తెదేపా 13, భాజపా 1 స్థానంలో గెలుపొంది తమ పట్టును చాటుకున్నాయి. నిడదవోలులో వైసీపీ 3 వార్డులతో సరిపెట్టుకోగా, ఒక్క చోట ఇండిపెండెంట్ గెలుపొందారు. ఈ ఫలితాలతో జిల్లావ్యాప్తంగా కూటమి శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాయి.
