Ktr : మాకు 10 సీట్లు ఇస్తే.. కేసీఆర్ శాసించే స్థాయికి వస్తారు- కేటీఆర్

ప్రధాని మోడీ.. అదానీ అంబానీలకు రుణమాఫీ చేసి వేల కోట్ల రూపాయలను వారికి కట్ట బెట్టారు. పేద ప్రజలను కొట్టి బడా బాబులకు పంచి పెట్టారు.

Ktr : కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించి ఇచ్చిన హామీల అమలు మరిచిందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి నిత్యవసర సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎంపీడీవో కార్యాలయం నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు చేపట్టిన ర్యాలీలో కేటీఆర్ తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

”కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించి ఇచ్చిన హామీల అమలు మరిచింది. కల్వకుర్తి ప్రాంతంలో మా వల్ల చిన్నచిన్న తప్పులు జరిగి ఉంటే వాటిని తుడిపేసి ఇప్పుడు ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించండి. నాగర్ కర్నూల్ ఎంపీతో పాటు 10 నుంచి 12 ఎంపీ సీట్లను గెలిపించి మాకు ఇస్తే మళ్లీ కేసీఆర్ శాసించే స్థాయికి వస్తారు. గుంపు మేస్త్రి ఇంటికి వెళ్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారిగానే అద్భుతాలు సృష్టించారు. ఇప్పుడు ఎంపీగా గెలిపిస్తే అందరి కోసం పని చేస్తారు.

ప్రధాని మోడీ.. ప్రజలకు జన్ ధన్ ఖాతాల ద్వారా 15 కోట్లు ఇస్తానని, నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు. కనీసం కృష్ణా జిల్లాల వాటా తేల్చకుండా తెలంగాణకు, పేద ప్రజలకు అన్యాయం చేశారు. మోడీ ప్రధాని అయ్యాక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి నిత్యవసర సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటాయి. ప్రధాని మోడీ.. అదానీ, అంబానీలకు రుణమాఫీ చేసి వేల కోట్ల రూపాయలను వారికి కట్ట బెట్టారు. పేద ప్రజలను కొట్టి బడా బాబులకు పంచి పెట్టారు” అని విరుచుకుపడ్డారు కేటీఆర్.

Also Read : ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు