CBI-Telangana: తెలంగాణలో సీబీఐ దర్యాప్తులకు అనుమతి ఉపసంహరణ.. ఆగస్టు 30నే జీవో విడుదల

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తులకు అనుమతిని ఉపసంహరించుకుంది. తెలంగాణలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చింది. అయితే, సీబీఐకి ఇచ్చిన ఆ అనుమతిని వెనక్కు తీసుకుంటూ ఆగస్టు 30న జీవో 51ను విడుదల చేసింది. తెలంగాణలో సీబీఐ కేసులు దర్యాప్తు చేయాలంటే ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

CBI-Telangana: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తులకు అనుమతిని ఉపసంహరించుకుంది. తెలంగాణలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చింది. అయితే, సీబీఐకి ఇచ్చిన ఆ అనుమతిని వెనక్కు తీసుకుంటూ ఆగస్టు 30న జీవో 51ను విడుదల చేసింది.

తెలంగాణలో సీబీఐ కేసులు దర్యాప్తు చేయాలంటే ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తాజాగా తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశం ఆలస్యంగా బయటకు వచ్చింది. ప్రస్తుతం బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితులు ఉన్నాయి.

ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫాంహౌస్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇటువంటి ఘటనలను టీఆర్ఎస్ ముందుగానే ఊహించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ, ఈడీలను వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కుప్పకూల్చుతుందని దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు