Tummala Nageswararao : ఖమ్మం జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా.. కానీ, ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తా : తుమ్మల

కార్యకర్తల దయతోనే జిల్లా కోసం 40 ఏళ్లు పని చేశానని తెలిపారు. జిల్లా ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడాలని కృషి చేశానని తెలిపారు.

Tummala Nageswararao Comments : ఖమ్మం జిల్లా సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా (Khammam District) ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఖమ్మం జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నాను కానీ, జిల్లా ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన జీవితాంతం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. తన రాజకీయ పదవి తన కోసం కాదని.. ఖమ్మం జిల్లా కోసమని తెలిపారు.

శుక్రవారం తుమ్మల నాగేశ్వరరావు ర్యాలీ ఖమ్మంకు చేరుకుంది. తన అనుచరులతో గొల్లగూడెం నివాసానికి చేరుకుకున్న ఆయన కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అనంతరం తుమ్మల కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తల దయతోనే జిల్లా కోసం 40 ఏళ్లు పని చేశానని తెలిపారు. జిల్లా ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడాలని కృషి చేశానని తెలిపారు. 40 సంవత్సరాల పాటు అందిరికీ సౌకర్యాల కోసం తన జీవితాన్ని త్యాగం చేశానని చెప్పారు.

Congress : కాంగ్రెస్ సీటు కోసం 1000 మంది దరఖాస్తు.. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, దరఖాస్తు చేయని ఐదుగురు ముఖ్య నేతలు

నాగలి దున్నుకునే తనను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశారని పేర్కొన్నారు. మూడు ప్రభుత్వాలలో తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తనకు కష్టం వచ్చినప్పుడు తనను కాపాడారని పేర్కొన్నారు. గోదావరి జలాలను పాలేరుకి తీసుకొస్తానని సీఎంకి చెప్పానని చెప్పారు. గోదావరి జలాలతో జిల్లా ప్రజల పాదాలు కడిగేంతవరకు ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పారు. తన చేతులతో పాలేరు, వైరా, బేతుపల్లి, ఉమ్మడి జిల్లాలో నీళ్లు నింపి జిల్లా ప్రజలకు దూరం అవుతానని చెప్పారు.

తనకు పదవి అధిపత్యం కోసం కాదన్నారు. కొంత మంది పరన్నాబకులు స్వార్థం కోసం చేశారని తన ప్రజలు చేతుల ఎత్తి నిలబెట్టారని తెలిపారు. ప్రజల కీర్తి కోసం, ఆత్మాభిమానం కోసం నిలబడుతానని చెప్పారు. ఎంతో మంది మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టారు, తనకు ఎక్కువ అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. అసలైన పనులు పూర్తి చేసి జిల్లా ప్రజలతో శబాష్ అనిపించుకుంటానని అన్నారు.

KCR : మహేందర్‌రెడ్డిని అందలం ఎక్కించింది అందుకేనా.. ఎన్నికల వేళ కేసీఆర్ కీలక ఎత్తుగడ!

తన వల్ల ఈ జిల్లాలో ఏ ఒక్కరు తలవంచే అవకాశం ఇవ్వబోనని తుమ్మల స్పష్టం చేశారు. ఈ ఎన్నికలలో తనను తప్పించామని పరాన్నభావులు ఆనందంగా ఉన్నారు ఎవర్ని నిందించనని అన్నారు. శ్రీ రాముడి ఆశీస్సులతో పది నియోజకవర్గాల్లో అందరు చిరు నవ్వుతో బతకాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ మార్పు, సీఎం కేసీఆర్ పై తుమ్మల విమర్శలు చేయలేదు. అయితే పోటీ చేసి తీరతానంటూ ప్రకటన చేశారు.

ట్రెండింగ్ వార్తలు