Vijay Sai Reddy : ఎన్నికల తర్వాత చంద్రబాబుపై మరో 10 కేసులు..!- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇండియాలోని ప్రతీ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఒక సిద్ధాంతం, నైతిక విలువలు లేని పార్టీ టీడీపీ. బీజేపీ లాంటి పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం చాలా వర్గాలను నిరాశకు గురిచేసింది.

Vijay Sai Reddy On Chandrababu

Vijay Sai Reddy : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికల తర్వాత చంద్రబాబుపై మరో 10 కేసులు నమోదవుతాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కందుకూరులో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ”నేను ఏ2 అయితే చంద్రబాబు పలు కేసుల్లో ఏ1.. నేను 22 కేసుల్లో ఏ2 కావచ్చు.. నేను ఎక్కడా కూడా ఆర్థిక నేరాలకు పాల్పడలేదు.. ఆ సెక్షన్స్ కూడా నా మీద లేవు.. చంద్రబాబు ఏ1 గా మూడు, నాలుగు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అనంతరం చంద్రబాబుపై మరో 10 కేసులు నమోదవుతాయి. లక్షల కోట్ల అవినీతికి పాల్పడి, ఆ డబ్బుతో విదేశాల్లో ఆస్తులు కొన్నారు. అవినీతి సొమ్ము అయినా ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏపీ అయినా బాగుపడేది. ఏ1 గా ఉన్న వ్యక్తి ఏ2 మీద ఆరోపణలు చేయటం అసంబద్ధం.

రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీగా గెలిచి మా పార్టీపైనే ఆరోపణలు చేశారు. మమ్మల్ని తిడుతూ ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరాం. బీజేపీతో కొల్యూడ్ అవ్వటం వల్లే చర్యల నుంచి తప్పించుకొన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తిని తమ పార్టీలోకి తీసుకుని చట్టసభలకు పంపాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఆయనను నమ్మే పరిస్థితి లేదు.

1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ప్రతీ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇండియాలోని ప్రతీ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఒక సిద్ధాంతం, నైతిక విలువలు లేని పార్టీ టీడీపీ. బీజేపీ లాంటి పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం చాలా వర్గాలను నిరాశకు గురిచేసింది. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలాచోట్ల మార్పులు చేయాల్సి వచ్చింది. అందరికీ న్యాయం చేసే బాధ్యత మా సీఎం తీసుకున్నారు. అందరికీ న్యాయం జరుగుతుంది” అని విజయసాయిరెడ్డి అన్నారు.

Also Read : ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు.. నెల్లూరు రూరల్‌లో గెలుపెవరిది?

ట్రెండింగ్ వార్తలు