Apple iPhone 14 Sale : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Apple iPhone 14 Sale : లేటెస్ట్ ఐఫోన్ 15ని కొనుగోలు చేసేందుకు మీ దగ్గర బడ్జెట్ లేకపోతే మరో ఐఫోన్ మోడల్ తీసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 14 ప్రత్యేక డీల్ అందిస్తోంది. ఐఫోన్ 14 తగ్గింపుతో విక్రయిస్తోంది.

Apple iPhone 14 Sale : భారత మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఆపిల్ ఐఫోన్ ఒకటి. ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా ఆపిల్ ఐఫోన్లకు క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. అయితే, చాలామంది వినియోగదారులు అత్యంత ఖరీదైన ఐఫోన్లను తక్కువ బడ్జెట్లో కొనుగోలు చేయాలంటే కష్టమే మరి. అందుకే, ఐఫోన్లను కొనేందుకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు.

Read Also : Best Mobile Phones : ఈ మే 2024లో భారత్‌లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

మార్కెట్లోకి కొత్త ఐఫోన్లు వచ్చిన తర్వాత పాత మోడల్ ఐఫోన్ల ధరలు భారీగా తగ్గుతుంటాయి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్‌లో ఆఫర్లు, డిస్కౌంట్లతో ఐఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 15 ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది.

అమెజాన్‌లో తగ్గింపు తర్వాత కూడా ఐఫోన్ ధర రూ.70వేల వద్ద ఉంది. మీరు మొదటిసారిగా ఐఫోన్‌ని కొనుగోలు చేయాలని చూస్తుంటే.. లేటెస్ట్ ఐఫోన్ 15ని కొనుగోలు చేసేందుకు మీ దగ్గర బడ్జెట్ లేకపోతే మరో ఐఫోన్ మోడల్ తీసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 14 ప్రత్యేక డీల్ అందిస్తోంది. ఐఫోన్ 14 తగ్గింపుతో విక్రయిస్తోంది.

ఈ ఐఫోన్ అసలు ధర రూ. 79,900 ఉండగా, 29 శాతం తగ్గింపుతో ఆఫర్ చేస్తోంది. తగ్గింపు తర్వాత ఐఫోన్ 14 ధర రూ. 58,999కు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. కొన్ని క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. మీరు ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13కు అప్‌గ్రేడ్ అవుతుంటే.. ఎక్స్ఛేజ్ ద్వారా ఐఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు.

ఐఫోన్ 14 ఎందుకు కొనాలంటే? :
భారత మార్కెట్లో 2022లో ఆపిల్ ఐఫోన్ 14 లాంచ్ అయింది. ఈ లైనప్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14ప్రో, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 14 మోడల్ 2021 ఐఫోన్ 13 మధ్య చాలా తేడాలు ఉన్నప్పటికీ.. ఐఫోన్ 14 ప్రో మోడల్‌లు అప్‌గ్రేడ్ ప్రాసెసర్, డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్ వంటి కొన్ని మార్పులను కలిగి ఉన్నాయి. అదే డైనమిక్ ఐలాండ్ నాచ్ ఇప్పుడు అన్ని ఐఫోన్ 15 మోడళ్లలో కూడా అందుబాటులో ఉంది.

ఐఫోన్ 14 మోడల్ ఐఫోన్ 13తో పోలిస్తే.. కెమెరాపరంగా కొన్ని అప్‌గ్రేడ్స్ కలిగి ఉంది. ఉదాహరణకు.. తక్కువ-కాంతి ఫోటోగ్రఫీ, బ్యాక్ కెమెరాలో ఫోటోనిక్ ఇంజిన్‌తో అప్‌గ్రేడ్ అయింది. అయితే, సరైన కాంతిలో ఫొటోగ్రఫీకి ఐఫోన్ 13, ఐఫోన్ 14తో సమానంగా ఉంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 13, ఐఫోన్ 14 రెండూ 12ఎంపీ కెమెరాలతో పనిచేస్తాయి. రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే?. ఐఫోన్ 13 మోడల్ 2.2 ఎపర్చరుతో పోలిస్తే.. ఐఫోన్ 14 మోడల్ 1.9 ఎపర్చరును కలిగి ఉంది. ఐఫోన్ 14 మొదటిసారిగా ఫ్రంట్ కెమెరాలో ఆటో-ఫోకస్ ఫీచర్‌ను కలిగి ఉంది.

Read Also : Bajaj Pulsar NS400Z Launch : భారత మార్కెట్లోకి సరికొత్త బజాజ్ పల్సర్ బైక్ వచ్చేసిందోచ్.. గంటకు 154కి.మీ వేగం.. ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు