Best Mobile Phones 2024 : ఈ మే 2024లో రూ.15వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Best Mobile Phones 2024 : ఈ జాబితాలో మోటో G64 5జీ ఫోన్, పోకో ఎం6 ప్రో 5జీ, లావా స్టార్మ్ 5జీ వంటి ఇతర ఫోన్లు కూడా ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best Mobile Phones 2024 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. వివిధ బ్రాండ్‌లలో సరసమైన స్మార్ట్‌ఫోన్లలో ప్రాసెసర్‌లు, లాంగ్ లైఫ్ బ్యాటరీలు, బెస్ట్ కెమెరా ఫీచర్లతో పొందవచ్చు.

కెమెరా క్వాలిటీలో మీ బడ్జెట్‌కు సరిపోయే కచ్చితమైన ఫోన్‌ను ఎంచుకోవచ్చు. ఈ మేలో మీరు రూ. 15వేల కొనుగోలు చేయగల అత్యుత్తమ ఫోన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో మోటో G64 5జీ ఫోన్, పోకో ఎం6 ప్రో 5జీ, లావా స్టార్మ్ 5జీ వంటి ఇతర ఫోన్లు కూడా ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Read Also : Top 5 Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 20వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

మోటో జీ64 5జీ :
రూ. 15వేల లోపు బెస్ట్ ఫోన్‌ల జాబితాలో సరికొత్త ఫోన్ మోటో G64 5జీ ఫోన్ ఒకటి. ఈ కొత్త 5జీ ఫోన్ మోటో జీ64 అనేది మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. రోజువారీ టాస్కులు, కొన్ని తేలికపాటి గేమింగ్‌లకు బెస్ట్ ప్రాసెసర్ కూడా. ఇందులో స్టోరేజ్ ఆప్షన్‌లు 2 వేరియంట్‌లలో వస్తాయి. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్, హై-ఎండ్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ అందిస్తుంది. యాప్‌లు, మీడియాకు ఎక్కువ స్టోరేజీ కావాలంటే హై ఆప్షన్ పరిగణనలోకి తీసుకోవాలి.

అయితే, ఈ 5జీ ఫోన్ ధర రూ. 15వేల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా కూడా చాలా బాగుంది. ఓఐఎస్‌తో 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో మరో హైలైట్ ఏమిటంటే.. క్లీన్ ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. చివరగా, మోటో జీ64 5జీ ఫోన్ పెద్ద 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ లుక్‌ గత వెర్షన్ల కన్నా భిన్నంగా లేదని గమనించాలి. కానీ, కొన్ని కొత్త కలర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

పోకో M6 ప్రో 5జీ :
ఈ జాబితాలో పోకో M6 ప్రో 5జీ ఫోన్ ఒకటి. ప్రత్యేకించి రూ. 15వేల లోపు 5జీ ఫోన్ కోసం చూస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో తక్కువ ధర రూ. 9,499కి కూడా పొందవచ్చు. మీ బడ్జెట్ తగినట్టుగా పోకో M6 ప్రో పర్ఫార్మెన్స్ లేదా యూజర్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో ఏమాత్రం తీసిపోదు. ఈ ఫోన్ వెనుక స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్ నుంచి లభిస్తుంది.

గరిష్టంగా 8జీబీ, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. మల్టీ టాస్క్ కోసం ఈజీగా ఫోన్ వినియోగించుకోవచ్చు. స్టోరేజీ విషయంలో ఆందోళన అక్కర్లేదు. చాలా యాప్‌లు, ఫైల్‌లను స్టోర్ చేయవచ్చు. హెవీ డ్యూటీ గేమింగ్‌కు సరైనది. రోజువారీ టాస్క్, సాధారణ గేమింగ్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే.. ఎలాంటి లైటింగ్ పరిస్థితుల్లో క్వాలటీ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

లావా స్టార్మ్ 5జీ :
సరసమైన ధరలో లావా స్టార్మ్ 5జీ ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ధర పరిధిలో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గేమింగ్, స్క్రోలింగ్ నుంచి వీడియోల వరకు ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. లావా స్టార్మ్ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6080 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. రోజువారీ పనులకు లైట్ గేమింగ్‌ను కూడా అందించగలదు.

5,000ఎంఎహెచ్ బ్యాటరీతో 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ అందిస్తుంది. కెమెరా మంచి లైటింగ్ పరిస్థితుల్లో అద్భుతమైన ఫొటోలను తీస్తుంది. లావా స్టార్మ్ 5జీ భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ద్వారా ఈ జాబితాలో ఉన్న ఏకైక ఫోన్ అని చెప్పవచ్చు. భారత మార్కెట్లో తయారైన ప్రొడక్టులకు సపోర్టు ఇవ్వాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ కూడా.

Read Also : Xiaomi 14 Smartphone : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో షావోమీ 14 స్మార్ట్‌ఫోన్ ధర కేవలం రూ. 30,899 మాత్రమే..!

ట్రెండింగ్ వార్తలు