Honor MagicBook Art 14 : కొత్త హానర్ మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 ల్యాప్‌టాప్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Honor MagicBook Art 14 Launch : మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 2024 60Wh లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. 30 నిమిషాల్లో 46 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ కోసం 95 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది.

Honor MagicBook Art 14 2024 With 14.6-Inch OLED Screen, Up to Intel Core Ultra 7 CPU Launched ( Image Source : Google )

Honor MagicBook Art 14 Launch : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? హానర్ మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 2024 కంపెనీ లాంచ్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. హానర్ మ్యాజిక్ వి3, మ్యాజిక్ విఎస్ 3, మ్యాజిక్‌ప్యాడ్ 2, హానర్ ప్యాడ్ 9 ప్రోలను కూడా ఆవిష్కరించింది. హానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్ చైనీస్ ఎడిషన్‌లో రన్ అవుతుంది.

14.6-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 32జీబీ వరకు ర్యామ్‌తో పాటు ఇంటెల్ కోర్ అల్ట్రా 5 లేదా కోర్ అల్ట్రా 7 సీపీయూలపై రన్ అవుతుంది. హానర్ మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 2024ను 60Wh బ్యాటరీతో 30 నిమిషాల్లో 46 శాతానికి ఛార్జ్ చేయగలదని కంపెనీ తెలిపింది.

Read Also : Vivo Y03t Launch : వివో నుంచి సరికొత్త Y03t ఫోన్, స్మార్ట్‌‌వాచ్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

హానర్ మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 2024 ధర, లభ్యత :
హానర్ మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 2024 సీఎన్‌వై ధర 7,799 (దాదాపు రూ. 89,800) వద్ద కోర్ అల్ట్రా 5 సీపీయూతో 16జీబీ ర్యామ్ కలిగి ఉంది. 32జీబీ ర్యామ్ కలిగిన కోర్ అల్ట్రా 5 మోడల్ ధర సీఎన్‌వై 8,499 (దాదాపు రూ. 97,900) ఉంటుంది. సీఎన్‌వై 9,499 (దాదాపు రూ. 1,09,400) ధరతో కూడిన కోర్ అల్ట్రా 7 సీపీయూ, 32జీబీ ర్యామ్ టాప్-ఎండ్ మోడల్‌ను కస్టమర్‌లు కొనుగోలు చేయవచ్చు.

ల్యాప్‌టాప్ కంపెనీ వెబ్‌సైట్‌లో సమ్మర్ ఆలివ్స్, సన్‌రైజ్ ఇంప్రెషన్స్ కలర్ ఆప్షన్‌లలో లిస్టు అయింది. ఇప్పటికే చైనాలో ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ఇతర మార్కెట్లలో ఈ డివైజ్ లాంచ్ చేయాలనే ప్లాన్లపై కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

హానర్ మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 2024 స్పెసిఫికేషన్‌లు :
కొత్తగా లాంచ్ అయిన హానర్ మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 2024 14.6-అంగుళాల అల్ట్రా-హెచ్‌డి (3,120×2,080 పిక్సెల్‌లు) ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను 258పీపీఐపిక్సెల్ డెన్సిటీ, 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. డీసీఐ:పీ3 కలర్ 100 శాతం కవరేజీని కూడా అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 7 155హెచ్ చిప్‌సెట్‌తో ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్‌లతో వస్తుంది. గరిష్టంగా 32జీబీ వరకు (LPDDR5X) ర్యామ్ కలిగి ఉంది.

హానర్ మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 2024 ల్యాప్‌టాప్‌ను 1టీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజీని అమర్చింది. కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై6, బ్లూటూత్ 5.3 ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, యూఎస్‌బీ 3.2 టైప్-ఎ పోర్ట్, థండర్‌బోల్ట్ 4 పోర్ట్, హెచ్‌డీఎంఐ2.1 పోర్ట్, 3.5ఎమ్ఎమ్ కాంబో ఆడియో పోర్ట్ ఉన్నాయి.

ల్యాప్‌టాప్ ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీని కూడా అందిస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 2024 60Wh లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. 30 నిమిషాల్లో 46 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ కోసం 95 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా.. 316.77×223.63×12.95ఎమ్ఎమ్, 1.03కిలోగ్రాముల బరువు ఉంటుంది.

Read Also : iQoo Pad 2 Pro Launch : కొత్త ఐక్యూ ప్యాడ్ 2 ప్రో చూశారా? ఫీచర్లు అదుర్స్.. కొంటే ఇలాంటి టాబ్లెట్ కొనాలి..!

ట్రెండింగ్ వార్తలు