అలాగైతే నేను రాజీనామా చేస్తాను: హరీశ్ రావు

రేషన్ కార్డు ఉన్న వారికి రుణమాఫీ అని ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు.

Harish Rao

Harish Rao: కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి ఆరు గ్యారంటీలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ మార్గదర్శకాలతో రైతుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టిందని తెలిపారు.

రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులకంటే దారుణమైన నిబంధనలు తెచ్చారని విమర్శించారు. రేషన్ కార్డు లేకుంటే రుణ మాఫీ వర్తించదా, ఇది రైతులను మోసం చేయడమేనని చెప్పారు. ప్రజా పాలనలో రేషన్ కార్డులకు 7 నెలల కింద దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

ఆధార్ కార్డులు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారని తెలిపారు. నిజమైన రైతుకు రుణమాఫీ జరగాలంటే పాస్ బుక్ ఆధారంగా జరుగాలని అన్నారు. ఇక పీఎం కిసాన్ పథకం నిబంధనలు అమలు చేస్తే 60 శాతం మంది రైతులు అనర్హులుగా మారతారని చెప్పారు. రైతులకు అన్యాయం చేయడమే అవుతుందగని తెలిపారు.

రైతులను అవమాన పరిచేలా ప్రభుత్వం నిబంధనలు తెచ్చిందని చెప్పారు. మాటలకు, చేతలకు ఈ ప్రభుత్వానికి పొంతన లేదని అన్నారు. రైతు ఆత్మహత్యలు ప్రతి రోజు ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయని తెలిపారు. రుణమాఫీ చేయకపోతే తాము రైతుల తరపున ఆందోళన చేస్తామని, అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని హెచ్చరించారు.

Also Read: ఆరోగ్యశ్రీపై అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ట్రెండింగ్ వార్తలు