Samsung Galaxy S22 : కొత్త ఫోన్ కావాలా? భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Samsung Galaxy S22 : శాంసంగ్ గెలాక్సీ ఎస్22 భారీ తగ్గింపును పొందింది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,999 ధరతో లభిస్తుంది. ఇదే డివైజ్ గత ఏడాదిలో రూ.72,999కి లాంచ్ అయింది. గెలాక్సీ ఎస్22పై రూ.33వేలు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు.

Samsung Galaxy S22 is available for less than Rs 40K

Samsung Galaxy S22 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సమయంలో అత్యల్ప ధరకు అందుబాటులో ఉంది. శాంసంగ్ గత ఏడాదిలో లాంచ్ చేసిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరకు విక్రయిస్తోంది.

గెలాక్సీ ఎస్22పై ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 39,999 ధర ట్యాగ్‌తో లిస్టు అయింది. భారత మార్కెట్లో రూ. 40వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. అనేక 5జీ ఫోన్‌లు ఉన్నప్పటికీ మీరు ఈ శాంసంగ్ ఫోన్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Hyundai Cars Discounts : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 డీల్ :
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 భారీ తగ్గింపును పొందింది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,999 ధరతో లభిస్తుంది. ఇదే డివైజ్ గత ఏడాదిలో రూ.72,999కి లాంచ్ అయింది. అంటే.. వినియోగదారులు గెలాక్సీ ఎస్22పై రూ.33వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 కొనుగోలు చేయాలా? వద్దా? :
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 పాత 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇందులో బెస్ట్ కెమెరా సెటప్, వేగవంతమైన పనితీరును అందిస్తుంది. సరసమైన ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీర్ఘ-కాల సాఫ్ట్‌వేర్ సపోర్టు చేస్తుంది. 4 ఏళ్ల ప్రధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల భద్రతా అప్‌డేట్స్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14, 15, 16 ఓఎస్ అప్‌డేట్‌లతో లేటెస్ట్‌గా ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 మోడల్ కొత్త గెలాక్సీ ఎస్23 మాదిరిగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. స్టీరియో స్పీకర్లు, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 6.1-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలు వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ రెండు డివైజ్‌లలో చిప్‌సెట్, బ్యాటరీలో వ్యత్యాసాలు ఉన్నాయి.

Samsung Galaxy S22

బ్యాటరీ పనితీరు ఎలా ఉందంటే? :
గెలాక్సీ ఎస్23 వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్, కొంచెం పెద్ద 3,900ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ తేడాలను సగటు వినియోగదారులు గుర్తించలేరనే చెప్పాలి. గెలాక్సీ ఎస్22 కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్ చిన్న డివైజ్ ఇష్టపడే వారికి అనుకూలంగా ఉంటుంది. చిన్న బ్యాటరీ ట్రేడ్-ఆఫ్‌తో వస్తుంది. గెలాక్సీ ఎస్22 బ్యాటరీ లైఫ్ టైమ్ భారీ వినియోగంలో రోజుకు కనీసం రెండుసార్లు ఛార్జింగ్ అవసరమవుతుందని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. అయితే, కాలింగ్, టెక్స్టింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ వంటి ప్రాథమిక కార్యకలాపాలకు బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ మోడల్ అనేది సిఫార్సు మరో అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ. 54,999కు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ ప్లస్ మోడల్ అసలు ప్రారంభ ధర రూ. 84,999 నుంచి తగ్గింది. ఈ వేరియంట్ మెరుగైన బ్యాటరీ లైఫ్, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలను అందిస్తుంది. 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. పనితీరు, కెమెరా సామర్థ్యాలు ప్రామాణిక మోడల్‌కు అనుగుణంగా ఉంటాయి.

Read Also : Pan Aadhaar Link : మీ పాన్ కార్డు ఆధార్‌తో లింక్ అయిందో లేదో చెక్ చేయడం తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్

ట్రెండింగ్ వార్తలు