Vivo X100 Series Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? ట్రిపుల్ కెమెరాలతో వివో నుంచి X100 సిరీస్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Vivo X100 Series Launch : వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు 5జీ ఫోన్ల ధర రూ. 63,999 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.

Vivo X100 and Vivo X100 Pro launched in India

Vivo X100 Series Launch in India : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త రెండు 5జీ సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో అనే స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, డైమెన్సిటీ 9300 ఎస్ఓసీ, గరిష్టంగా 16జీబీ ర్యామ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

వివో కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ అయింది. మీరు X100 సిరీస్ స్మార్ట్‌ఫోన్ నుంచి రెండు డివైజ్‌లను పొందవచ్చు. ఈ వివో ఎక్స్ కెమెరాల్లో రెండూ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో 50ఎంపీ ప్రధాన కెమెరాతో ఉన్నాయి. 5,400ఎంఎహెచ్ బ్యాటరీ, 16జీబీ వరకు ర్యామ్, 8టీ ఎల్‌‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ. 63,999 నుంచి ప్రారంభమవుతుంది.

వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో ధర ఎంతంటే? :
వివో ఎక్స్100 రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. అయితే, వివో ఎక్స్100 ప్రో ఒకే వేరియంట్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • వివో ఎక్స్100 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ. 63,999
  • వివో ఎక్స్100 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ ధర రూ. 69,999
  • వివో ఎక్స్100 ప్రో, 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ ధర రూ. 89,999.

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు ప్రీ-బుకింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆఫ్‌లైన్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, జియో డిజిటల్ స్టోర్స్ వంటి ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించవచ్చు. వివో కూడా ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా చేసిన పేమెంట్లతో కస్టమర్‌లకు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందే బ్యాంక్ ఆఫర్‌లను ప్రకటించింది. కస్టమర్‌లు ఎక్స్‌ఛేంజ్‌తో రూ. 8వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

Read Also : Apple iPhone 14 Sale : రూ.60వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో ఫీచర్లు :
వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో మీడియాటెక్ డైమన్షిటీ 9300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతాయి. వివో ఎక్స్100 రెండు వేరియంట్‌లలో వస్తుంది. అందులో ఒకటి 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో మరొకటి 16జీబీ ర్యామ్ 512జీబీ స్టోరేజీతో వస్తుంది. అయితే, వివో ఎక్స్100 ప్రో 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీతో సింగిల్ వేరియంట్‌లో వస్తుంది. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో మోడల్ 8టీ ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో 6.78-అంగుళాల స్క్రీన్, 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 3,000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉన్నాయి.

Vivo X100 and Vivo X100 Pro Price

వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో రెండూ డిస్‌ప్లేలో ఫింగర్‌ప్రింట్ రీడర్‌లను కలిగి ఉంటాయి. ముందు భాగంలో సెల్ఫీలకు రెండు స్మార్ట్‌ఫోన్‌లు 32ఎంపీ కెమెరాను అందిస్తాయి. రెండు ఫోన్‌లు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నాయి. వివో ఎక్స్100 ప్రోలో 50ఎంపీ ప్రధాన కెమెరా, ప్రత్యేక పెరిస్కోప్ జూమ్ కెమెరా ఉన్నాయి.

ఈ జూమ్ కెమెరాలో 50ఎంపీ సెన్సార్, 100ఎంఎం లెన్స్ ఉంది. (Zeiss APO) ధృవీకరణను పొందింది. అదనంగా, 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. వివో లేటెస్ట్ 6ఎన్ఎమ్ వి3 ఇమేజింగ్ చిప్‌ని ఉపయోగిస్తుంది. వివో ఎక్స్100, మరోవైపు, 50ఎంపీ వైడ్-యాంగిల్ లెన్స్, 64ఎంపీ సెన్సార్‌తో 70ఎమ్ఎమ్ జూమ్ లెన్స్, ఎక్స్100 ప్రో మాదిరిగా అదే 15ఎమ్ఎమ్ అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది.

అయితే, గత ఏడాది నుంచి వి2 ఇమేజింగ్ చిప్‌ను ఉపయోగిస్తుంది. వివో ఎక్స్100 మోడల్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, అయితే వివో ఎక్స్100 ప్రో మోడల్ 5,400ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఆసక్తికరంగా ఎక్స్100 గరిష్టంగా 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టును అందిస్తుంది. అయితే, వివో ఎక్స్100 ప్రో డివైజ్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. 100డబ్ల్యూ వరకు వేగంగా ఛార్జింగ్ చేసేందుకు మాత్రమే సపోర్టు ఇస్తుంది.

Read Also : Redmi Note 13 Series : భారత్‌కు రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ వచ్చేసింది.. కేవలం ధర రూ.16,999 మాత్రమే.. సేల్ డేట్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు