WhatsApp Block Messages : వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్.. ఇకపై అన్‌నౌన్ మెసేజ్‌లను ఈజీగా బ్లాక్ చేయొచ్చు..!

WhatsApp Block Messages : ఆండ్రాయిడ్ 2.24.17.24 వెర్షన్‌లో వాట్సాప్ బీటాలో కొత్త బ్లాక్ అన్‌నౌన్ అకౌంట్ల మెసేజ్‌లను టోగుల్ చేసింది. ఇటీవల ఆండ్రాయిడ్‌లోని బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చింది. ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లోనే ఉంది.

WhatsApp Working on Feature to Block Messages ( Image Source : Google )

WhatsApp Block Messages : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ప్రొటెక్షన్ ఫీచర్ వస్తోంది. ఫీచర్ ట్రాకర్ వివరాల ప్రకారం.. వాట్సాప్ త్వరలో అన్‌నౌన్ అకౌంట్ల నుంచి వచ్చిన నిర్దిష్ట మెసేజ్‌ల నుంచి బ్లాక్ చేయొచ్చు. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను తమకు తెలియని అకౌంట్ల నుంచి వచ్చిన మెసేజ్‌లను బ్లాక్ చేసేందుకు అనుమతించే ఒక ఫీచర్‌పై పనిచేస్తోందని నివేదించింది.

Read Also : WhatsApp Meta AI : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెటా ఏఐతో కస్టమ్ స్టిక్కర్లు క్రియేట్ చేయొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

వాట్సాప్ ఫోన్ పర్ఫార్మెన్స్, వారి అకౌంట్ సేఫ్‌గా ఉంచుతుంది. వాట్సాప్ మెసేజింగ్ యాప్‌లో స్టేటస్ అప్‌డేట్‌లను “లైక్” చేసే అవకాశం అందిస్తుంది. ఇతర వినియోగదారులు అప్‌లోడ్ చేసిన ఫొటో, వీడియో, టెక్స్ట్ స్టోరీలకు త్వరగా రెస్పాండ్ అయ్యేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

అన్‌నౌన్ అకౌంట్ల మెసేజ్‌లను బ్లాక్ చేయొచ్చు :
ఆండ్రాయిడ్ 2.24.17.24 వెర్షన్‌లో వాట్సాప్ బీటాలో కొత్త బ్లాక్ అన్‌నౌన్ అకౌంట్ల మెసేజ్‌లను టోగుల్ చేసింది. ఇటీవల ఆండ్రాయిడ్‌లోని బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చింది. ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లోనే ఉంది. వినియోగదారులు ఫీచర్‌ ప్రయత్నించడానికి మార్గం లేదు. రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఎనేబుల్ చేసినట్టుగా కనిపిస్తోంది. సెట్టింగ్‌ల యాప్‌లో ప్రైవసీ> అడ్వాన్స్‌డ్ మెను కింద చూపించే కొత్త సెట్టింగ్ స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేసింది. నిర్దిష్ట వాల్యూమ్‌ను మించి ఉంటే.. అన్‌నౌన్ అకౌంట్ల నుంచి మెసేజ్‌లను వాట్సాప్ బ్లాక్ చేస్తుంది.

లీకైన వివరణ ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ పర్ఫార్మెన్స్ యూజర్ల అకౌంట్ సురక్షితంగా ఉంచడానికి వాట్సాప్ గుర్తుతెలియని వారి నుంచి మెసేజ్‌లను బ్లాక్ చేస్తుందని తెలుస్తోంది. భవిష్యత్తులో బ్లాక్ చేసిన గుర్తుతెలియని అకౌంట్ మెసేజ్‌లలో కొన్ని మెసేజ్‌లను అనుమతించవచ్చునని సూచిస్తుంది.

సిగ్నల్ డిఫాల్ట్‌గా గుర్తుతెలియని అకౌంట్ల ద్వారా పంపిన మెసేజ్‌లను నియంత్రిస్తుంది. అన్‌నౌన్ యూజర్ ప్రారంభించిన చాట్ యాక్సెస్ చేయడం లేదా రిపోర్టు యూజర్లను అడుగుతుంది. రిసీవర్ మెసేజ్ రిక్వెస్ట్ అంగీకరించే వరకు పంపినవారికి చదివిన రిసిప్ట్ కనిపించవు. అయితే, ఇతర ఆప్షన్లలో పంపినవారు భవిష్యత్తులో రిసీవర్‌ను కంటాక్ట్ కాకుండా నిరోధించవచ్చు.

వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌ల రియాక్షన్ ఫీచర్లు :
వాట్సాప్ బీటా టెస్టర్లు ఇప్పుడు స్టేటస్ అప్‌డేట్‌లకు రిప్లయ్ ఇవ్వొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల మాదిరిగానే 24 గంటల పాటు టెక్స్ట్, ఇమేజ్‌లు, వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. హార్ట్ ఎమోజీతో ఫేస్‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్ రెండూ ఒకే ట్యాప్‌తో మెసేజ్‌లకు సామర్థ్యాన్ని అందిస్తాయి.

అదే యాక్టివిటీని ఇప్పుడు వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా ఆండ్రాయిడ్ 2.24.17.21 వాట్సాప్ బీటాకు అప్‌డేట్ చేసిన తర్వాత స్క్రీన్ కింది కుడి వైపున రిప్లయ్ బాక్స్ పక్కన కొత్త హార్ట్ ఐకాన్ కనిపించాలి. ఈ ఫీచర్ నెమ్మదిగా వాట్సాప్ యూజర్లందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ షేర్ చేసిన వివరాల ప్రకారం.. వినియోగదారులు తమ స్టోరీని వీక్షించిన కాంటాక్టులను చూపించే లిస్టు ద్వారా వారి స్టోరీకి ఎవరు స్పందించారో చూడగలరు. లైకింగ్ స్టేటస్ అప్‌డేట్‌లు ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే కనిపిస్తాయి. వినియోగదారులు తమ స్టోరీని ఎవరు ఇష్టపడ్డారో చూడగలరు. ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లోని వినియోగదారులకు రాబోయే యాప్ వెర్షన్‌తో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Read Also : Vivo V40 First Sale : వివో V40 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర, స్పెషిఫికేషన్లు వివరాలివే..!

ట్రెండింగ్ వార్తలు