Mobile Internet Speed : మీ ఫోన్‌లో 5G వాడితే ఇంటర్నెట్ స్లో అవుతుందా? డేటా స్పీడ్ పెరగాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి..!

Mobile internet Speed : మీ మొబైల్ ఇంటర్నెట్ చాలా స్లోగా ఉందా? మీ మొబైల్ డేటా బాగానే ఉన్నా ఇంటర్నెట్ స్లోగా వస్తుందా? మీ ఫోన్ 5G ఉన్నా డేటా స్పీడ్ పెరగడం లేదా? ఈ టెక్ టిప్స్ ఓసారి ట్రై చేయండి..

Mobile internet slow even after 5G_ Here's how to boost data speed quickly

Mobile internet Speed with 5G Network : భారత టెలికం మార్కెట్లో డేటా సంచలనం రిలయన్స్ జియో (Reliance Jio), ఆ తర్వాత ఎయిర్‌టెల్ (Airtel 5G) తమ 5G సర్వీసులను భారత్ అంతటా విస్తరిస్తున్నాయి. ఇంటర్నెట్ యూజర్లు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ యాక్సస్ చేసుకోవడం చాలా సులభమే.. ఐదో జనరేషన్ మొబైల్ నెట్‌వర్క్ 4G LTE కన్నా 20-30 రెట్లు 5G ఎక్కువ స్పీడ్ కలిగి ఉంది. అంతేకాదు.. యూజర్లకు మెరుగైన నెట్‌వర్క్ సర్వీసును కూడా అందిస్తోంది. అయినప్పటికీ, 5Gతో కూడా ఇంటర్నెట్ స్పీడ్ నెమ్మదిగా ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ డేటా నిదానంగా ఉన్నట్లు గమనిస్తే.. మీ డేటా స్పీడ్ పెరగడానికి ఈ టెక్ టిప్స్ ఓసారి ఫాలో అవ్వండి.

మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ని చెక్ చేయండి :
మీరు 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయ్యారా? లేదా ఓసారి చెక్ చేయండి. మీ ఫోన్‌లో సెట్టింగ్‌ (Settings) ఓపెన్ చేయాలి. అందులో సెల్యులార్ డేటా ఆప్షన్ కింద మీ ఫోన్ కనెక్ట్ అయిన నెట్‌వర్క్‌ల లిస్టును చెక్ చేయొచ్చు. అందులో మీకు 5G లిస్టు అయితే మీకు 5G నెట్‌వర్క్ యాక్సస్ అయినట్టే.

మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి :
మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా ఉందా? మొబైల్ డేటా ఆన్ కావడం లేదా? అయితే ఓసారి మీ డివైజ్ రీస్టార్ట్ చేయడం మంచిది. అలా చేస్తే.. మీ మొబైల్ డేటా ఆన్ కావడంతో పాటు ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేసేందుకు పవర్ ఆఫ్ స్లయిడర్ కనిపించే వరకు పవర్ బటన్‌ను నొక్కి పట్టుకోండి. పవర్ ఆఫ్ స్లయిడర్‌ను కుడివైపుకి డ్రాగ్ చేయండి. ఆపై మీ ఫోన్‌ని తిరిగి ఆన్ చేసే ముందు కొన్ని సెకన్లు వేచి ఉండండి.

Read Also : Tech Tips in Telugu : గూగుల్ పే, పోన్‌పే, పేటీఎంతో UPI పేమెంట్స్ చేస్తున్నారా? ఈ 5 సేఫ్టీ టిప్స్ తప్పక పాటించండి..!

యాప్‌లను ఫోర్స్‌గా స్టాప్ చేయండి :
మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్‌లు ఓపెన్ అయి ఉంటే.. మీ డేటాను ఉపయోగించుకోవచ్చు. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ స్లో అవుతుంది. యాప్‌లను బలవంతంగా క్లోజ్ చేయాలి. యాప్ స్విచ్చర్‌ను ఓపెన్ చేయండి.ఐఫోన్ (iPhone)లో హోమ్ బటన్‌ను రెండుసార్లు క్లిక్ చేయండి లేదా Android ఫోన్‌లో స్క్రీన్ దిగువ నుంచి పైకి స్వైప్ చేయండి. అంతకంటే ముందు మీ అవసరం లేని యాప్‌లను కూడా స్వైప్ చేయండి.

Mobile internet slow even after 5G

Cache క్లియర్ చేయండి :
మీ ఫోన్ cache ఉంటే.. ఇటీవల విజిట్ చేసిన వెబ్‌సైట్‌లు, యాప్‌ల నుంచి డేటాను స్టోర్ చేస్తుంది. లోడ్ అయ్యే సమయాన్ని స్పీడ్ చేయడంలో సాయపడుతుంది. మీ ఫోన్ స్పేస్‌ని ఆక్రమిస్తుంది. మీ ఫోన్‌ని స్లో అయ్యేలా చేస్తుంది. మీ Cache క్లియర్ చేసేందుకు Settings యాప్‌ని ఓపెన్ చేసి General >Storage & iCloud Usage > మేనేజ్‌మెంట్ స్టోరేజీకి వెళ్లి Cache క్లియర్ చేయాలనుకునే యాప్‌పై Tap చేయండి. ఆపై Clear Cache ఆప్షన్ Tap చేయండి.

మీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి :
మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ నిరంతరం కొత్త ఫీచర్లు, బగ్ పరిష్కారాలతో అప్‌డేట్ అవుతుంది. మీరు సాఫ్ట్‌వేర్ లేటెస్ట్ వెర్షన్ లేకుంటే బగ్ కారణంగా మీ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంది. అప్‌డేట్‌ల కోసం చెక్ చేయడానికి, Settings యాప్‌ని ఓపెన్ చేసి General > Sofware Update వెళ్లండి. అప్‌డేట్ అందుబాటులో ఉంటే.. డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ బటన్‌పై Tap చేయండి.

ప్లయిట్ మోడ్‌ని ఆన్ లేదా ఆఫ్ చేయండి :
ఎయిర్‌ప్లేన్ మోడ్‌ని ఆన్ చేసి, ఆపై దాన్ని మళ్లీ Off చేయండి. మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ని రీసెట్ చేసేందుకు మీ స్పీడ్ మెరుగుపర్చేందుకు సాయపడుతుంది.

Read Also : UPI Payment Stuck : మీ యూపీఐ పేమెంట్ నిలిచిపోయిందా? ఈ 6 విషయాలను తప్పక తెలుసుకోండి..!