UPI Payment Stuck : మీ యూపీఐ పేమెంట్ నిలిచిపోయిందా? ఈ 6 విషయాలను తప్పక తెలుసుకోండి..!

UPI Payment Stuck : మీ రోజువారీ లావాదేవీల పరిమితిని మించిపోయినా లేదా బ్యాంక్ సర్వర్ డౌన్ అయినా UPI లావాదేవీలు నిలిచిపోవచ్చు లేదా విఫలం కావచ్చు. మీ పేమెంట్ పూర్తి చేసేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

UPI Payment Stuck : మీ యూపీఐ పేమెంట్ నిలిచిపోయిందా? ఈ 6 విషయాలను తప్పక తెలుసుకోండి..!

UPI Payment Stuck or failed_ 6 things you can do to complete your transaction

Updated On : August 18, 2024 / 7:37 PM IST

UPI Payment Stuck : ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అక్షరాలా మన జీవితాలను సులభతరం చేసింది. షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేస్తున్నా లేదా బంకులో పెట్రోల్ నింపినా అన్ని యూపీఐ పేమెంట్లు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్ సమయంలో విఫలమైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఉదాహరణకు, మనలో చాలా మంది ఆటో డ్రైవర్‌కి చెల్లించడానికి ప్రయత్నించే సమయంలో యూపీఐ పేమెంట్ నిలిచిపోయింది. యూపీఐ లావాదేవీ పూర్తయ్యే వరకు వేచి చూడలేం. స్నేహితుడికి ఫోన్ చేసిన క్యాష్ పేమెంట్ పూర్తి చేస్తుంటారు.

అయితే, యూపీఐ పేమెంట్లు ఎందుకు నిలిచిపోయాయి? యూపీఐ లావాదేవీల సమయంలో పేమెంట్ వైఫల్యానికి దారితీయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు UPI IDని తప్పుగా నమోదు చేసినా, రిసీవర్ అడ్రస్ సరిగ్గా లేకున్నా, బ్యాంక్ సర్వర్లు పని చేయకపోయినా లేదా మీ ఇంటర్నెట్ పని చేయకుంటే UPI ట్రాన్స్‌ఫర్ ఫెయిల్ కావొచ్చు. మీరు కూడా ఇలాంటి పేమెంట్ సమస్యలను ఎదుర్కొన్నట్లయితే, మీ పేమెంట్ పూర్తి చేయడంలో సాయపడేందుకు కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయి.

మీ రోజువారీ UPI పేమెంట్ లిమిట్ చెక్ చేయండి :
చాలా బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు యూపీఐ లావాదేవీలను పరిమితం చేశాయి. అదనంగా, NPCI మార్గదర్శకాల ప్రకారం.. యూపీఐ లావాదేవీలో బదిలీ చేయగల గరిష్ట మొత్తం రూ. 1 లక్ష మాత్రమే.. మీరు రోజువారీ నగదు బదిలీ పరిమితిని దాటినా లేదా దాదాపు 10 యూపీఐ లావాదేవీలు చేస్తే.. మీ రోజువారీ లిమిట్ మళ్లీ పెరగడానికి మీరు 24 గంటలపాటు వేచి ఉండవలసి ఉంటుంది. మీరు పేమెంట్ మధ్యలో ఉన్నట్లయితే.. వేరే బ్యాంక్ అకౌంట్ లేదా పేమెంట్ పద్ధతి నుంచి పేమెంట చేయడానికి ప్రయత్నించండి.

Read Also : iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ చూశారా? కొత్త డిజైన్ అదుర్స్.. అధికారిక ఫొటో లీక్.. ఫీచర్లు ఇవేనా?

మీ UPI IDని ఎక్కువ బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేయండి :
యూపీఐ వైఫల్యాలు లేదా పేమెంట్లు నిలిచిపోవడానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి.. బ్యాంక్ సర్వర్లు బిజీగా ఉండటం.. అందుకే ఈ సమస్యను నివారించడానికి మీ UPI IDకి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను లింక్ చేయడం మంచిది. మీ బ్యాంక్ సర్వర్‌లలో ఒకటి డౌన్ అయినట్లయితే.. మీరు మీ ఇతర బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చు.

UPI Payment Stuck or failed_ 6 things you can do to complete your transaction

UPI Payment Stuck or failed

రిసీవర్ వివరాలను చెక్ చేయండి :
డబ్బు పంపేటప్పుడు రిసీవర్ బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్‌ను కచ్చితంగా చెక్ చేయాలి. డబ్బు పంపేటప్పుడు పంపినవారు తప్పుగా IFSC కోడ్ లేదా అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేస్తే.. యూజర్లకు పేమెంట్ విఫలం అవుతుంది.

సరైన UPI PINని ఎంటర్ చేయండి :
అనేక పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. మీ ఫోన్ పాస్‌వర్డ్, ATM PIN, ఇమెయిల్‌లు అన్ని పాస్‌వర్డులను మరిచిపోయే అవకాశం ఉంది. అలాగే, మీ UPI పిన్‌ కూడా మరచిపోయే అవకాశం ఉంది. మీరు మీ UPI పిన్‌ని కోల్పోతే.. యూపీఐ ‘Forget UPI PIN’ పై Tap చేయాలి. సీక్రెట్ పిన్‌ని రీసెట్ చేయడానికి కొన్ని దశల ద్వారా రీసెట్ చేయవచ్చు. అదనంగా, మీరు మీ పిన్‌ను తరచుగా మరచిపోతే.. ఎక్కడైనా సురక్షితంగా రాసుకోవాలి. అయితే, మీ పిన్‌ను ఎవరూ చూడకుండా జాగ్రత్త వహించండి. లేదంటే మీరు మీ డబ్బును కోల్పోయే అవకాశం ఉంది.

మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ని చెక్ చేయండి :
యూపీఐ పేమెంట్లు నిలిచిపోవడానికి లేదా విఫలం కావడానికి ప్రధాన కారణాలలో నెట్‌వర్క్ కనెక్షన్ ఒకటి. మీకు సిగ్నల్ లభిస్తుందో లేదో చెక్ చేసుకోండి. పంపినవారిని వారి హాట్‌స్పాట్‌ని ఆన్ చేయమని అడగండి. తద్వారా మీరు స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ని పొందవచ్చు. మీ డివైజ్ రీస్టార్ట్ చేయాలి లేదా ఇంటర్నెట్ కనెక్షన్‌ కోసం ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి ఆఫ్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.

యూపీఐ లైట్‌ని ప్రయత్నించండి :
బ్యాంక్ సర్వర్లు స్లో ఉన్నా లేదా నెట్‌వర్క్ సమస్యలు ఉన్నా UPI పేమెంట్ వైఫల్యాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు. యూజర్లకు సాయం చేసేందుకు NPCI గత ఏడాదిలో UPI Liteని ప్రవేశపెట్టింది. UPI లైట్‌ని ఉపయోగించి.. మీరు రూ. 200 వరకు ఇన్‌స్టంట్ పేమెంట్లను ప్రారంభించవచ్చు. యూపీఐ లైట్ యూజర్లు గరిష్టంగా రూ. 2వేలు రోజుకు రెండుసార్లు, రూ. 4వేలు వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. దీనికి మీరు UPI పిన్‌ని ఎంటర్ చేయాల్సిన పనిలేదు. బ్యాంక్ సర్వర్‌లపై ఆధారపడకుండా ప్రస్తుతం, UPI లైట్ సర్వీసు Paytm, PhonePeలో అందుబాటులో ఉంది. త్వరలో ఇతర పేమెంట్ల యాప్‌లలో కూడా అందుబాటులోకి రానుంది.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డీల్.. ధర ఎంత తగ్గిందంటే? మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!