ATM New Rules : ఏప్రిల్ 1 నుంచి ATM కొత్త రూల్స్.. UPI ద్వారా ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు.. ఎలాగంటే?
ATM New Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఏటీఎం రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఇకపై ఏటీఎం కార్డుతో పనిలేకుండా నేరుగా బ్యాంకు ఏటీఎంల్లో నుంచి డబ్బలను డ్రా చేసుకోవచ్చు.
ATM New Rules
- ఏప్రిల్ 1 నుంచి మారనున్న ఏటీఎం నిబంధనలు
- యూపీఐ ద్వారా ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు
- ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే ఛార్జీలు తప్పవు
ATM New Rules : ఏటీఎం కార్డుదారులకు గుడ్ న్యూస్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) బ్యాంకుల్లో కొత్త ఏటీఎం నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంకు వినియోగదారులు ఇకపై యూపీఐ ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. లావాదేవీల లెక్కలు, రుసుములు, నిర్దిష్ట డెబిట్ కార్డులకు రోజువారీ విత్‌డ్రాయల్ లిమిట్స్ వర్తిస్తాయి.
యూపీఐ ద్వారా ఏటీఎం విత్‌డ్రాయల్స్ :
యూపీఐతో ఏటీఎంల నుంచి చేసే క్యాష్ ట్రాన్సాక్షన్లు ఇకపై ఉచిత లావాదేవీల నెలవారీ పరిమితితో అమల్లో ఉంటాయని బ్యాంక్ పేర్కొంది. ఇంతకుముందు, ఈ లావాదేవీలను వేరుగా లెక్కించేవారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత యూపీఐ ద్వారా కార్డ్ లేకుండా చేసే ఏటీఎంల నుంచి ఫ్రీగానే క్యాష్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు.
ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ తర్వాత ఛార్జీలు :
ఒకవేళ యూపీఐ యూజర్లు ఫ్రీ విత్‌డ్రా లిమిట్ దాటితే టాక్సులతో పాటు ప్రతి అదనపు లావాదేవీకి బ్యాంకు రూ. 23 రుసుమును విధిస్తుంది. ప్రస్తుతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలు ప్రతి నెలా 5 ఫ్రీ క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలు మెట్రోపాలిటన్ ప్రాంతాలలో మూడు, నాన్-మెట్రోపాలిటన్ ప్రాంతాలలో 5 ఉచిత విత్ డ్రా చేసుకోవచ్చు.
యూపీఐతో ఏటీఎం విత్‌డ్రాయల్స్ :
యూపీఐ ఆధారిత ఏటీఎం విత్‌డ్రాయల్స్‌కు డెబిట్ కార్డ్ అవసరం లేదు. కస్టమర్లు ఏటీఎంపై కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేసి తమ యూపీఐ యాప్‌తో లావాదేవీ పూర్తి చేయొచ్చు. ఆ తర్వాత వారు మెషిన్ నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అనేక బ్యాంకులు డిజిటల్ పేమెంట్లను క్యాష్ విత్‌డ్రాయల్స్‌తో లింక్ చేసేందుకు ఈ ఫీచర్‌ను విస్తరిస్తున్నాయి.
PNB కొత్త రూల్స్ ఇవే :
పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొన్ని డెబిట్ కార్డుల ఏటీఎం క్యాష్ విత్ డ్రా లిమిట్స్ విషయంలో మార్పులను ప్రకటించింది. నిర్దిష్ట కార్డ్ కేటగిరీలకు రోజువారీ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ తగ్గించనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
అయితే, ఈ కొత్త పరిమితులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ కొత్త నిబంధనలు డెబిట్ కార్డులకు వర్తిస్తాయో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే పెద్ద మొత్తంలో లావాదేవీల కోసం యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ పేమెంట్లను వాడుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
