EPF Pension : నెలవారీ రూ. 1000తో బతకడం కష్టం.. పెన్షనర్లకు తక్షణమే ఈపీఎఫ్ పెన్షన్ పెంచాలి!
EPF Pension : కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షన్ పెంచబోతుందా? నెలవారీగా అందే రూ. 1000 పెన్షన్ కొంచెం కూడా సరిపోదని, వెంటనే ఈపీఎఫ్ పెన్షన్ పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది.
EPF Pension
- రూ. 1000 కనీస ఈపీఎఫ్ పింఛను సరిపోదన్న పార్లమెంటరీ కమిటీ
- తక్షణమే గౌరవప్రదమైన స్థాయికి పెన్షన్ పెంచాలని ప్రతిపాదన
- ప్రభుత్వం రూ. 2500 నుంచి రూ. 3000 మేర పెంచే అవకాశం
EPF Pension : ఈపీఎఫ్ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్… అతి త్వరలో మూడు రెట్లు ఈపీఎఫ్ పెన్షన్ పెరగనుంది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (EPS 95) కింద పెన్షనర్లకు అందుతున్న నెలవారీ పెన్షన్ భారీగా పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ స్థాయి కమిటీ సిఫార్సు చేసింది.
ప్రస్తుతం అందుతున్న నెలవారీ రూ. 1000 పెన్షన్ ఎంతమాత్రం సరిపోదని, వెంటనే గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని తెలిపింది. ఒకవైపు నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే పెన్షన్ మొత్తాన్ని పెంచాల్సిందిగా సూచించింది.
ఈపీఎఫ్ కింద కనీస నెలసరి పింఛను రూ. 7,500 ఉండాలనే ఉద్యోగ సంఘాల చిరకాల డిమాండ్ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఈ సిఫార్సు చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రభుత్వం ఇప్పటికే పింఛనును రూ. 2,500 నుంచి రూ. 3,000కు పెంచే విషయాన్ని పరిశీలిస్తోంది.
Read Also : ATM New Rules : ఏప్రిల్ 1 నుంచి ATM కొత్త రూల్స్.. UPI ద్వారా ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు.. ఎలాగంటే?
కనీస వేతన స్థాయి పెంచాలని డిమాండ్ :
పెరుగుతున్న జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని జాతీయ కనీస వేతన స్థాయిని పెంచాలని జాతీయ కనీస వేతన స్థాయిల (NFLMW) రిపోర్టు కూడా సిఫార్సు చేసింది.
పెన్షనర్లకు సామాజిక భద్రత, ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు స్కీమ్ బడ్జెట్ పెంచే అవకాశాలను పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.
గిగ్ వర్కర్లను ఈశ్రమ్ పోర్టల్ రిజిస్టర్ తప్పనిసరి చేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద రక్షణ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించే చూడాలని తెలిపింది. రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్ గనుల సమగ్ర డేటాబేస్ రెడీ చేయాలని అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమాదాల సమయంలో పరిహారం అందడం ఆలస్యం జరుగుతోందని గుర్తుచేసింది. వెంటనే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించేలా చూడాలని సూచించింది. కార్మిక కోడ్ అమలు కోసం అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. పార్లమెంటరీ కమిటీ సూచనలను అమలు చేయాలా? లేదా అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
