WhatsApp Secret Code : వాట్సాప్‌లో లాక్ చాట్స్ కోసం సీక్రెట్ కోడ్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp Secret Code : వాట్సాప్ చాట్ లాక్ ఫీచర్ సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ అకౌంట్లో లాక్ చేసిన చాట్స్‌కు హైడ్ చేసేందుకు ఈ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్ ప్రవేశపెట్టింది.

WhatsApp Secret Code : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లాక్ చేసిన చాట్‌ల కోసం కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ చాట్ లాక్ ఫీచర్‌ను ప్రకటించింది. అయితే, ఇప్పుడు మీ లాక్ చేసిన చాట్‌లను సీక్రెడ్ కోడ్‌తో హైడ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఫలితంగా, మీ ఫోన్‌ను స్నేహితుడికి ఇచ్చినప్పుడు లేదా మీ ఫోన్ ఎవరి చేతుల్లోకి అయిన వెళ్లినప్పుడు ఇతర వినియోగదారులతో మీ వ్యక్తిగత చాటింగ్ మెసేజ్‌లను వారికి కనిపించకుండా దాచుకోవచ్చు.

సీక్రెట్ కోడ్‌తో చాట్ ఎలా హైడ్ చేయొచ్చుంటే?
మీ ఫోన్ పిన్ లేదా పాస్‌కోడ్‌తో లేదా మీ ఫేస్ లేదా వేలిముద్రను స్కాన్ చేయడం ద్వారా మీ చాట్‌లను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చాట్ లాక్ ఫీచర్‌లో కొత్త సీక్రెట్ కోడ్ తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. యూజర్లు తమ చాట్‌ని ఎంచుకుని, పాస్‌వర్డ్ ద్వారా లాక్ చేయడానికి అనుమతిస్తుంది. సీక్రెడ్ కోడ్ ద్వారా హైడ్ చేసిన చాట్‌లు ప్రధాన చాట్ జాబితాలో కనిపించవు. సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేసినప్పుడు మాత్రమే యాక్సెస్ అవుతాయి. మెసేజ్ ప్లాట్‌ఫారమ్‌కు సెక్యూరిటీని మరింత అందించేందుకు ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చింది.

Read Also : Most Expensive Cities : 2023 ఏడాదిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఏంటో తెలుసా?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో యాప్ బీటా వెర్షన్‌లో ఫీచర్‌ని టెస్టింగ్ చేసింది. మీరు లాక్ చేసిన చాట్‌ లిస్టును ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎగువన ఉన్న మూడు-చుక్కల మెనుని ట్యాప్ చేయండి> చాట్ లాక్ సెట్టింగ్‌లు > Hide locked chats అనే ఆప్షన్‌పై టోగుల్ చేయాలి. మీరు సులభంగా గుర్తుంచుకోగలిగే రహస్య కోడ్‌ను ఎంటర్ చేసిన తర్వాత మీ లాక్ చేసిన చాట్‌లు ఇకపై ప్రధాన చాట్‌లో కనిపించవు. విండో లో ప్రస్తుతం, వాట్సాప్ చాట్ స్క్రీన్‌పై కిందికి స్వైప్ చేస్తున్నప్పుడు లాక్ చేసిన చాట్‌ల షార్ట్‌కట్‌ కనిపిస్తుంది. మీ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఐడీని ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు.

WhatsApp Secret Code Feature

లాక్ చేసిన చాట్స్ ఓపెన్ చేయాలంటే? :
మీరు సీక్రెట్ కోడ్‌ను సెట్ చేసిన తర్వాత వాట్సాప్‌లో లాక్ చేసిన చాట్‌లను బహిర్గతం చేసేందుకు మరో మార్గం ఉంది. మీరు యాప్‌లోని సెర్చ్ బార్‌లో తప్పనిసరిగా అదే సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఇది చాట్ లాక్ ఫీచర్ ద్వారా ప్రొటెక్ట్ చేసిన చాట్స్‌లను చూపుతుంది. కానీ, మీరు యాప్ నుంచి నిష్క్రమించే వరకు మాత్రమే కనిపిస్తుంది.

మీరు వాట్సాప్‌లో చాట్‌లను దాచాల్సిన అవసరం లేకుంటే.. మీ రహస్య కోడ్‌ని ఉపయోగించి లాక్ చేసిన చాట్‌ల జాబితాను ఓపెన్ చేసి.. ఆపై త్రి డాట్స్ మెను > చాట్ లాక్ సెట్టింగ్‌లపై ట్యాప్ చేయాలి. తద్వారా మీరు అసలు చాట్ లాక్ ఫీచర్‌కి తిరిగి రావచ్చు. సీక్రెట్ కోడ్ ఫీచర్ నిలిపివేయడానికి లాక్ చేసిన చాట్‌లను డిసేబుల్ ఆప్షన్‌కు మార్చుకోవాలి.

చాట్‌ను లాక్ చేయడానికి మీరు వ్యక్తిగత చాట్ సెట్టింగ్‌లను ఎంటర్ చేయనవసరం లేదని వాట్సాప్ చెబుతోంది. మీరు లాక్ చేసేందుకు చాట్‌ను ఎక్కువసేపు నొక్కవచ్చు. సీక్రెట్ కోడ్ ఫీచర్ యూజర్‌లకు అందుబాటులోకి వచ్చినప్పటికీ, రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అందరి యూజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సాప్ డెస్క్‌టాప్ కోసం వాట్సాప్‌కు సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను ఎప్పుడు తీసుకువస్తుందా లేదా అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

Read Also : Fall Of Byjus : బైజూస్‌కు షాకిచ్చిన ప్రోసస్.. ఈ దెబ్బతో భారీగా పతనం.. 3 బిలియన్ డాలర్లకు తగ్గిన కంపెనీ విలువ..!

ట్రెండింగ్ వార్తలు