Windows 11 Free Upgrade : విండోస్ 7, 8 యూజర్లకు అలర్ట్.. విండోస్ 11కు ఫ్రీగా అప్‌గ్రేడ్ చేసుకోలేరు.. ఎందుకో తెలుసా?

Windows 11 Free Upgrade : విండోస్ 7, విండోస్ 8 వినియోగదారుల కోసం ఉచిత (Windows 11) అప్‌గ్రేడ్‌ విధానాన్ని మైక్రోసాఫ్ట్ (Microsoft) నిలిపివేస్తోంది. విండోస్ OS యాక్టివేషన్ కోసం లీగల్ విండోస్ 11 సీరియల్ కీ (Serial Key) ఎలా పొందాలంటే?

Windows 7, 8 users can no longer upgrade to Windows 11 for free, here is why

Windows 11 Free Upgrade : మీరు విండోస్ (Windows 7, Windows 8) వాడుతున్నారా? విండోస్ వినియోగదారులను (Windows 11)కి ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అనుమతించే లొసుగును మైక్రోసాఫ్ట్ (Microsoft) అధికారికంగా నిలిపివేసింది. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. అదనపు ఖర్చులు లేకుండా పాత విండోస్ వెర్షన్‌ల నుంచి లేటెస్ట్ వెర్షన్ OS (Operating System Version) మారడానికి వినియోగదారులను అనుమతించే విధానానికి ముగింపు పలికింది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ చేయకుండా విండోస్ 7, విండోస్ 8 కీలను బ్లాక్ చేయాలనే నిర్ణయాన్ని మైక్రోసాఫ్ట్ గత నెలలో ప్రకటించింది.

విండోస్ 7 కీతో విండోస్ 11 అప్‌గ్రేడ్ ఇక కుదరదు :
ఎందుకంటే.. మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సెక్యూరిటీ అప్ డేట్స్ నిలిపివేసింది. విండోస్ 7 అప్‌డేట్ చేసుకోవడం కూడా కుదరదు.. ఈ క్రమంలోనే వినియోగదారులు ఇప్పటికీ ఈ (Serial Key)లతో Windows 11ని యాక్టివ్ చేసుకోగలిగారు. ఈ వారం నాటికి విండోస్ 11 క్లీన్ ఇన్‌స్టాలేషన్‌ల కోసం (Windows 7 Keys) ఉపయోగించకుండా పూర్తిగా బ్లాక్ చేసినట్టు మైక్రోసాఫ్ట్ ధృవీకరించింది. విండోస్ 11 లేటెస్ట్ అప్ గ్రేడ్ వెర్షన్ (Windows 11 Download) డౌన్ లోడ్ చేసుకోవాలంటే.. అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : Tech Tips in Telugu : గూగుల్ సెర్చ్‌లో మీ పర్సనల్ డేటాను ఎలా తొలగించాలో తెలుసా? ఇదిగో సింపుల్ గైడ్ మీకోసం..!

ఆచరణాత్మక పరంగా.. విండోస్ 7 Key సాయంతో విండోస్ 11ని Active చేయడానికి ప్రయత్నించినప్పుడు.. ‘మీ వద్ద చెల్లుబాటు అయ్యే డిజిటల్ లైసెన్స్ లేదా ప్రొడక్టు కీ (Product Key) లేనందున ఈ డివైజ్‌లో విండోస్ యాక్టివ్ చేయలేమని మెసేజ్ సూచిస్తోంది. ఈ మెసేజ్ పాత విండోస్ 7 లేదా 8 వెర్షన్ కీలను కలిగిన వినియోగదారులకు ఉచిత అప్‌గ్రేడ్ చేయడం కుదరదని సూచిస్తుంది.

విండోస్ 11 లీగల్ Key కొనాల్సిందే :
ఇప్పటికే విండోస్ యూజర్ల PCని విండోస్ 7 లేదా విండోస్ 8 నుంచి విండోస్ 11కి అప్‌గ్రేడ్ చేసిన లేదా యాక్టివేషన్ కోసం ఈ పాత కీలను ఉపయోగించిన యూజర్లకు వారి OS యాక్టివేషన్ స్టేటస్‌లో ఎలాంటి మార్పు ఉండదు. అంతేకాదు.. ఆయా యూజర్ల డిజిటల్ లైసెన్స్‌లు వ్యాలీడేట్ అయ్యేవి యాక్టివ్‌గా ఉండాలి. అయితే, భవిష్యత్తులో ఈ అప్‌గ్రేడ్ లొసుగును సద్వినియోగం చేసుకోవాలని భావించే యూజర్లు ఎవరైనా మైక్రోసాఫ్ట్ లీగల్ విండోస్ 11 Key కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

Windows 7, 8 upgrade to Windows 11

మైక్రోసాఫ్ట్ ఈ చర్యతో లైసెన్సింగ్ వ్యూహంలో పెనుమార్పును సూచిస్తుంది. సరైన ఛానల్‌ల ద్వారా కొత్త విండోస్ వెర్షన్‌లకు వలస వెళ్లడానికి వినియోగదారులను ప్రోత్సహించడంలో కంపెనీ నిబద్ధతను బలోపేతం చేస్తుంది. ఉచిత అప్‌గ్రేడ్‌లు మునుపటి విండోస్ రిలీజ్ ఫీచర్ అయినప్పటికీ, మైక్రోసాఫ్ట్ ఇప్పుడు లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, (Windows 11)ని యాక్సెస్ చేయడానికి రియల్ ప్రొడక్టు కీల ప్రాముఖ్యతను సూచిస్తుంది. యాక్టివేషన్, లైసెన్సింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది.

విండోస్ 10 నుంచి విండోస్ 11 అప్‌గ్రేడ్ చేయాలా? :
మీరు (Windows 10) నుంచి అప్‌గ్రేడ్ చేస్తుంటే.. మీ PC అప్‌గ్రేడ్ సిద్ధంగా ఉందని (Windows Update) ద్వారా వారికి తెలియజేసే వరకు వేచి ఉండాలని కంపెనీ వినియోగదారులను సిఫార్సు చేస్తోంది. ఇన్‌స్టాల్ చేసే ముందు.. మీ కంప్యూటర్ (Windows 11) కోసం కనీస సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ అనుగుణంగా ఉందని నిర్ధారించడానికి పీసీ హెల్త్ చెక్ (PC Health Check) యాప్‌ని చూడటం మంచిది. మీ డివైజ్ ప్రభావితం చేసే తెలిసిన సమస్యలకు విండోస్ రిలీజ్ డేటా స్టేటస్ చెక్ చేయండి.

Read Also : OnePlus Open Launch : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 19నే లాంచ్.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు