YSR Kadapa: బ్రహ్మంగారి మఠంలో కోట్లలో అవినీతి.. బయట పడతాయనే భయంతోనే?

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా కృషి చేస్తామని బ్రహ్మపదం పీఠాధిపతి కృష్ణమాచార్యులు వెల్లడించారు. దివంగత పీఠాధిపతి వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతి విజయలక్ష్మమ్మ చేసిన ఫిర్యాదుపై స్పందించిన కృష్ణమాచార్యులు..

YSR Kadapa: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా కృషి చేస్తామని బ్రహ్మపదం పీఠాధిపతి కృష్ణమాచార్యులు వెల్లడించారు. దివంగత పీఠాధిపతి వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతి విజయలక్ష్మమ్మ చేసిన ఫిర్యాదుపై స్పందించిన కృష్ణమాచార్యులు.. మేము మొదటి విడతలో బ్రహ్మంగారి మఠం పర్యటించినప్పుడు ఆమె ఎటువంటి ఆక్షేపణలు చేయలేదని చెప్పారు. మఠం మేనేజర్ తో పాటు మరికొంతమంది ప్రోద్బలంతోనే ఆమె ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేశారన్నారు.

అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము బ్రహ్మంగారి మఠం సందర్శించి అందరి అభిప్రాయాలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కృష్ణమాచార్యులు తెలిపారు. బ్రహ్మంగారి మఠంలో కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఆయన అవి ఎక్కడ బయట పడతాయో అన్న భయంతోనే మమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంలో మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు.

ధర్మబద్ధంగా బ్రహ్మంగారి మఠం విశిష్టతను కాపాడేందుకు కోసం ధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు శివ స్వామి ఆధ్వర్యంలో శనివారం 20 మంది పీఠాధిపతులు వస్తుండగా అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో ప్రభుత్వ పెద్దలు వెంటనే జోక్యం చేసుకోవాలని కృష్ణమాచార్యులు కోరారు.

ట్రెండింగ్ వార్తలు