IPL 2024 : డుప్లెసిస్ వీరబాదుడు.. దడ పుట్టించిన బెంగళూరు.. గుజరాత్ విలవిల!

IPL 2024 RCB vs GT : బెంగళూరు బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్), కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీ బాదాడు. గుజరాత్‌పై బెంగళూరు 4 వికెట్ల తేడాతో గెలిచింది.

IPL 2024 RCB vs GT : బెంగళూరు దెబ్బకు గుజరాత్ విలవిలాడిపోయింది. ఐపీఎల్ 2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం (మే 4) ఇక్కడ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హాట్రిక్ విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు గుజరాత్ నిర్దేశించిన 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్) రాణించగా, కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీతో వీరబాదుడు బాదాడు.

ఫలితంగా బెంగళూరు ఇంకా 38 బంతులు మిగిలి ఉండగానే 13.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులతో సునాయసంగా విజయ లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఆర్సీబీ తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. మిగతా బెంగళూరు ఆటగాళ్లలో విల్ జాక్స్ (1), రజత్ పాటిదార్ (2), గ్లెన్ మాక్స్‌వెల్ (4), కామెరెన్ గ్రీన్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా, దినేష్ కార్తీక్ (21 నాటౌట్), స్వప్నిల్ సింగ్ (15 నాటౌట్)గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో జాషువా లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ షిరాజ్ (2/29)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

షారుఖ్ ఖాన్ టాప్ స్కోరు :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 19.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ ప్లేయర్లలో షారుఖ్ ఖాన్ (37) టాప్ స్కోరు చేయగా, మిగతా ఆటగాళ్లలో రాహుల్ తెవాటియా (35), డేవిడ్ మిల్లర్ (30), రషీద్ ఖాన్ (18), విజయ్ శంకర్ (10), శుభమన్ గిల్ (2), వృద్ధిమాన్ సాహా (1), మానవ్ సుతార్ (1) పరుగులతో రాణించారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, యశ్ దయాళ్, వైశాఖ్ విజయ్ కుమార్ తలో రెండు వికెట్లు తీయగా, కామెరాన్ గ్రీన్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ 7లో బెంగళూరు :
పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 7 ఓడి 8 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 7 ఓడి 8 పాయింట్లతో దిగువన 9వ స్థానానికి పడిపోయింది.

ట్రెండింగ్ వార్తలు