PV Sindhu : సురక్షితంగా బెంగళూరు చేరుకున్న పీవీ సింధు.. విశ్రాంతి తీసుకుంటా.. రీ సెట్ అయ్యాక..
దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu ) ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది.
PV Sindhu returns safely to India after being stranded at Dubai airport
- దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు
- ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి
PV Sindhu : దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం గతవారం పీవీ సింధు యూకేకు బయలు దేరింది. అమెరికా, ఇజ్రాయెల్ లు కలిసి ఇరాన్ పై యుద్దానికి దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత శనివారం నుంచి దుబాయ్‌లో విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
సింధుతో పాటు పలువురు ప్రముఖులు, చాలా మంది భారత ప్రజలు అక్కడ చిక్కుకుని పోయారు. ఈ నేపథ్యంలో యూఏఈ, భారత అధికారుల సమన్వయంతో అక్కడ చిక్కుకుపోయిన వారిని భారతదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే సింధు బెంగళూరుకు చేరుకుంది.
తాను సురక్షితంగా స్వదేశంలో అడుగుపెట్టినట్లు పీవీ సింధు సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించింది. ‘సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నాను. గత కొన్ని రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొన్నా. మొత్తానికి ఇంటికి చేరుకున్నాను.’ అని సింధు ట్వీట్ చేసింది.
Back home in Bangalore and safe 🙏
The last few days have been intense and uncertain, but I’m truly grateful to be back to my house. A heartfelt thank you to the incredible ground teams, Dubai authorities, airport staff, immigration, and every single person who stepped up and…
— Pvsindhu (@Pvsindhu1) March 3, 2026
‘క్లిష్ట పరిస్థితుల్లో కూడా మమ్మల్ని బాగా చూసుకున్న దుబాయ్ అధికారులు, ఎయిర్ పోర్టు సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు అందించిన సేవలను మాట్లల్లో చెప్పలేనివి. ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. రీసెట్ అయ్యాక భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తాను.’ అని సింధు రాసుకొచ్చింది.
Shahid Afridi : ఆఖరి ఓవర్ ఎలా వేయాలో తెలియదా.. అల్లుడి పై షాహిద్ అఫ్రిది ఫైర్.. నువ్వు అసలు..
ఇదిలా ఉంటే.. మంగళవారం నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. కాగా ఈ టోర్నీ నుంచి సింధు తప్పుకుంది.
