Damaged Hair : పోషణ లేక పొడిబారి నిర్జీవంగా మారిపోయిన శిరోజాల కోసం!

శిరోజాల ఆరోగ్యకరమైన మెరుపు కోసం రసానిక గాఢత అధికంగా ఉండే షాంపులను నివారించాలి. అలాంటి వాటిని వాడటం వల్ల జుట్టు మృధుత్వం కోల్పోవటంతోపాటు ఎక్కవగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. బలహీన బడిన జుట్టుకు తిరిగి ధృఢత్వం తీసుకు వచ్చేందుకు నూనెను గోరువెచ్చగా చేసి రాసుకోవాలి.

Damaged Hair : శరీర సంరక్షణ విషయంలో చాలా మంది పెద్దగా శ్రద్ధ కనబరచరు. దీని వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలాలు మారుతున్న సమయంలో పలు రకాల చర్మ సమస్యలే కాకకుండా శిరోజాలు సైతం సమస్యలకు లోనవుతుంటాయి. సరైన పోషణ లేకపోవటమే ఇందుకు కారణం. దీని వల్ల శిరోజాలు నిర్జీవంగా మారిపోయి రాలిపోతాయి.

కొన్ని జాగ్రత్తలు పాటిస్తే శిరోజాల ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. శిరోజాల ఆరోగ్యకరమైన మెరుపు కోసం రసానిక గాఢత అధికంగా ఉండే షాంపులను నివారించాలి. అలాంటి వాటిని వాడటం వల్ల జుట్టు మృధుత్వం కోల్పోవటంతోపాటు ఎక్కవగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. బలహీన బడిన జుట్టుకు తిరిగి ధృఢత్వం తీసుకు వచ్చేందుకు నూనెను గోరువెచ్చగా చేసి రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగవుతుంది. బలం చేకూరుతుంది. బాదం నూనె, కొబ్బరి నూనెలు వాటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగవ్వటానికి ఒక టర్కీ టవల్ ను తీసుకుని బాగా తడిపి నీటిని పిండిన తరువాత ఒక నిమిషం సమయం మైక్రోవేవ్ లో ఉంచాలి. తరువాత దానిని తలకు చుట్టుకోవాలి. ఇలా గోరు వెచ్చని టవల్ కుదుళ్లకు స్టీమ్ థెరపీలో తోడ్పడుతుంది. తద్వారా రక్తప్రసరణ మెరుగవుతుంది. తలస్నానం చేసుకున్న ప్రతిసారీ కండిషనర్ ను తప్పనిసరిగా రాయటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు