Dhanush : ధనుష్ కష్టాలు.. పదిగంటల పాటు డంప్ యార్డ్ లో..

ప్రస్తుతం కుబేర సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. తాజాగా ముంబైలో ఓ డంప్ యార్డ్ లో రోజంతా షూటింగ్ చేసారంట.

Dhanush : తమిళ్ స్టార్ హీరో ధనుష్ సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడని తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా సినిమాలు ఓకే చేస్తున్నాడు ధనుష్. తెలుగులో గతంలో సర్ సినిమాతో హిట్ కొట్టి ఇప్పుడు కుబేర సినిమా చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ మెయిన్ లీడ్ గా, నాగార్జున ముఖ్య పాత్రలో కుబేర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే కుబేర సినిమా నుంచి ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ధనుష్ డీ గ్లామర్ రోల్ చేస్తున్నాడు. రిలీజయిన ఫస్ట్ లుక్ చూస్తుంటే ధనుష్ బిచ్చగాడిలా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అయితే కుబేర సినిమా చాలా వరకు ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం కుబేర సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. తాజాగా ముంబైలో ఓ డంప్ యార్డ్ లో రోజంతా షూటింగ్ చేసారంట.

Also Read : Daksha Nagarkar : హాస్పిటల్లో హీరోయిన్.. సర్జరీ చాలా కష్టంగా ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్..

మూవీ యూనిట్ మాస్క్ లు, గ్లౌజ్ లు ఇలా జాగ్రత్తలు తీసుకొని షూట్ చేసినా ధనుష్ మాత్రం క్యారెక్టర్ కోసం రియల్ గా ఎలాంటి సేఫ్టీ లేకుండా దాదాపు 10 గంటల పాటు ఆ డంప్ యార్డ్ లో షూటింగ్ లో పాల్గొన్నాడు అని తెలుస్తుంది. రియల్ ఎమోషన్స్ రావడానికి బ్రేక్ లో కూడా ఎలాంటి మాస్క్ లేకుండా అలాగే ఉండి డంప్ యార్డ్ లో తన క్యారెక్టర్ బాగా రావడానికి కష్టపడ్డారట ధనుష్. దీంతో ఈ సమాచారం వైరల్ అవ్వగా ధనుష్ కి సినిమాపై ఉన్న నిబద్దత మరోసారి ప్రూవ్ అయింది అంటూ అభిమానులు, నెటిజన్లు ధనుష్ ని అభినందిస్తున్నారు. సినిమా కోసం డంప్ యార్డ్ లో స్టార్ హీరో ఈ రేంజ్ లో షూట్ చేస్తున్నాడంటే మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి అని ఆసక్తి పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు