Daksha Nagarkar : హాస్పిటల్లో హీరోయిన్.. సర్జరీ చాలా కష్టంగా ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా దక్ష నగార్కర్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Daksha Nagarkar : హాస్పిటల్లో హీరోయిన్.. సర్జరీ చాలా కష్టంగా ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్..

Daksha Nagarkar Shares an Emotional Post from Hospital Bed

Updated On : May 6, 2024 / 10:49 AM IST

Daksha Nagarkar : ఇటీవల పలువురు సెలబ్రిటీలు వారికి హెల్త్ పరంగా ఏమైనా సమస్యలు వచ్చినా వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ముందుగా తామే ఈ న్యూస్ చెప్పేసి ధైర్యంగా ఉండండి అంటూ అభిమానులకు చెప్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఇలాంటి పోస్ట్ చేసింది. ముంబై భామ దక్ష నగార్కర్ తెలుగులో సినిమాలు చేస్తుంది. వరుస ఆఫర్స్ కోసం ఎదురుచూస్తూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. దక్ష ఫోటోలు షేర్ చేసిందంటే అవి వైరల్ అవ్వాల్సిందే. తాజాగా దక్ష నగార్కర్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

 

పలు ఫోటోలు షేర్ చేస్తూ దక్ష నగార్కర్.. గత కొన్ని రోజులుగా నేను స్ట్రెచర్‌పై తెలియని వ్యక్తులతో సర్జరీ గదిలో ఉండటం చాలా కష్టంగా అనిపించింది. నాకు రెండు సార్లు వెన్నెముకపై అనస్థీషియా ఇచ్చారు. దాని నుంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. నా ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు సపోర్ట్ గా నిలిచారు. ఇలాంటి సమయంలో మనిషిని ఎలా ప్రేమించాలో చూపించారు. ప్రేమ, కేరింగ్ కి కనిపించని గాయాలను నయం చేసే శక్తి ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. దయచేసి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను సంతోషకరమైన విషయాలనే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు బాధపడకూడదు కాబట్టి అని తెలిపింది.

Also Read : Game Changer Update : గేమ్ ఛేంజర్ మూవీ అప్డేట్.. కొత్త షూటింగ్ షెడ్యూల్ ఎప్పుడు? ఎక్కడ?

దీంతో దక్ష నగార్కర్ కి ఏదో సర్జరీ అయిందని, ప్రస్తుతం ఇంకా హాస్పిటల్ లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సర్జరీ అయిందని చెప్పింది కానీ ఏ సర్జరీ అయింది, అసలు ఏమైంది అనేది దక్ష నగార్కర్ తెలపలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు దక్ష త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.