Game Changer Update : గేమ్ ఛేంజర్ మూవీ అప్డేట్.. కొత్త షూటింగ్ షెడ్యూల్ ఎప్పుడు? ఎక్కడ?

భారీ బడ్జెట్ తో, భారీ కాస్ట్ తో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాని చాలా లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు.

Game Changer Update : గేమ్ ఛేంజర్ మూవీ అప్డేట్.. కొత్త షూటింగ్ షెడ్యూల్ ఎప్పుడు? ఎక్కడ?

Ram Charan Shankar Game Changer Movie Shooting Update

Updated On : May 6, 2024 / 10:27 AM IST

Game Changer Update : రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా షూటింగ్ కూడా పూర్తికాలేదు. కానీ ఈ సంవత్సరం ఎలాగైనా రిలీజ్ చేస్తామని దిల్ రాజు తెలిపారు. భారీ బడ్జెట్ తో, భారీ కాస్ట్ తో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాని చాలా లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు.

ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా పూణే, వైజాగ్, రాజమండ్రి, కర్నూల్, చెన్నై, హైదరాబాద్.. ఇలా చాలా ప్రదేశాల్లో షూట్ చేసారు. ఇటీవలే రెండు రోజులు చెన్నై లో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేటి నుండి రాజమండ్రి, పరిసర ప్రాంతాల్లో గేమ్ ఛేంజర్ షూట్ వారం రోజుల పాటు జరగనుంది. సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ గతంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఫ్లాష్ బ్యాక్ షూట్ జరగ్గా చరణ్, అంజలి ఫోటోలు లీక్ అయ్యాయి.

Also Read : Suhas : సుహాస్‌కి పొలిటికల్ పార్టీ ఆఫర్.. ఎన్నికల ప్రచారం చేస్తే భారీగా ఇస్తామని..

ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. పాలిటిక్స్, నిజాయితీ గల ఆఫీసర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్స్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి కానీ మూవీ యూనిట్ నుంచి జరగండి సాంగ్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. సెప్టెంబర్ లేదా నవంబర్ లో రిలీజ్ చేస్తామంటున్న దానిపై కూడా క్లారిటీ లేదు. అభిమానులు మాత్రం గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.