Jharkhand : ఝార్ఖండ్‌లో ఈడీ దాడులు.. మంత్రి పీఏ పనిమనిషి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

చిన్నచిన్న సంచుల్లో నోట్ల కట్టలను ఉంచి వాటిని ఓ గదిలో భద్రపర్చగా.. ఈడీ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ము విలువ సుమారు రూ. 30 కోట్ల వరకు ఉంటుందని ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ED Recovered Huge amount In Jharkhand : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచిన నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రం సీనియర్ కాంగ్రెస్ నేత, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇల్లు, అతని అనుచరులకు సంబంధించిన అనేక ప్రదేశాల్లో సోమవారం ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి ఇంట్లో ఈడీ సోదాలు చేయగా గుట్టల కొద్దీ డబ్బు కట్టలు వెలుగులోకి వచ్చాయి. చిన్నచిన్న సంచుల్లో నోట్ల కట్టలను ఉంచి వాటిని ఓ గదిలో భద్రపర్చగా.. ఈడీ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ము విలువ సుమారు రూ. 30 కోట్ల వరకు ఉంటుందని ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read : తెలంగాణలో బీజేపీ దూకుడు.. పార్టీ జాతీయ నేతల సుడిగాలి పర్యటనలు.. అన్నమలై బైక్ ర్యాలీ

గతేడాది ఫిబ్రవరి నెలలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె.రామ్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. శాఖకు సంబంధించిన పలు పథకాల్లో అవతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కేసులో వీరేంద్ర ను అరెస్టు చేశారు. అదే కేసును విచారిస్తున్న క్రమంలో చాలా మంది పెద్ద వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు ఈడీ ముందు వీరేంద్ర వెల్లడించినట్లు తెలిసింది. తాజాగా సమాచారం మేరకు అలంగీర్ ఆలం మంత్రి వర్గంలో అక్రమ సొమ్ము వారి ఇళ్లలో పనిచేసే వారి ఇళ్లకు వెల్తుందని ఈడీ సమాచారం సేకరించింది. ఈ క్రమంలో అలంగీర్ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో పనిచేసే వ్యక్తి ఇంట్లో ఈడీ దాడులు చేయగా.. భారీ మొత్తంలో డబ్బు వెలుగులోకి వచ్చింది.

Also Read : CM Revanth Reddy : చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించండి : రేవంత్ రెడ్డి

అలంగీర్ ఆలం కాంగ్రెస్ సీనియర్ నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అలంగీర్ 2006 నుంచి 2009 వరకు ఝార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ గానూ పనిచేశారు. కోట్లాది రూపాయల విలువైన కరెన్సీ కట్టలు వెలుగులోకి రావడంపై బీజేపీ స్పందించింది. ఝార్ఖండ్ లో అవినీతి ముగిసిపోలేదు.. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా సదరు వ్యక్తులు దీనిని ఉపయోగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోందని, దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరింది.

 

ట్రెండింగ్ వార్తలు