తెలంగాణలో బీజేపీ దూకుడు.. పార్టీ జాతీయ నేతల సుడిగాలి పర్యటనలు.. అన్నమలై బైక్ ర్యాలీ

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఇవాళ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా

తెలంగాణలో బీజేపీ దూకుడు.. పార్టీ జాతీయ నేతల సుడిగాలి పర్యటనలు.. అన్నమలై బైక్ ర్యాలీ

BJP President JP Nadda

Lok sabha Election 2024 : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ నేతలు రాష్ట్రంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇకనుంచి జాతీయ స్థాయి అగ్రనేతలు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సోమవారం జేపీ నడ్డా, అన్నామలైతో పాటు పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.

Also Read : KCR Road Show : ఎన్నో దశబ్దాల కల.. జగిత్యాల జిల్లాగా ఉండాలంటే మన అభ్యర్థులను గెలిపించండి : కేసీఆర్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ రాష్ట్రంలోని మూడు చోట్ల బహిరంగ సభల్లో పాల్గోనున్నారు. ఉదయం 10గంటలకు పెద్దపల్లి నియోజకవర్గంలో నిర్వహించ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు భువనగిరి, మధ్యాహ్నం 3గంటలకు నల్గొండ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మలుసైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10గంటలకు సికింద్రాబాద్ పార్లమెంట్ లోని ముషీరాబాద్ లో పుష్కర్ సింగ్ దామీ బీజేపీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం నర్సంపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సికింద్రాబాద్ లోని ఇంపిరియల్ గార్డెన్ లో నార్త్ ఇండియా ప్రజలతో సమావేశం కానున్నారు.

Also Read : Revanth Reddy: అందుకే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి: రేవంత్ రెడ్డి

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఇవాళ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా మధ్యామ్నం 12గంటలకు బైక్ ర్యాలీలో అన్నమలై పాల్గొంటారు. మధ్యాహ్నం 3గంటలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 6గంటలకు కిషన్ రెడ్డికి మద్దతుగా సనత్ నగర్ నుండి పద్మారావు నగర్ వరకు బైక్ ర్యాలీలో అన్నమలై పాల్గోనున్నారు.