KCR Road Show : ఎన్నో దశబ్దాల కల.. జగిత్యాల జిల్లాగా ఉండాలంటే మన అభ్యర్థులను గెలిపించండి : కేసీఆర్

KCR Road Show : ఎన్నో దశబ్దాల కల జగిత్యాల జిల్లా.. అలాంటిది ఈ జిల్లాను ఈ ప్రభుత్వం తీసేస్తాంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

KCR Road Show : ఎన్నో దశబ్దాల కల.. జగిత్యాల జిల్లాగా ఉండాలంటే మన అభ్యర్థులను గెలిపించండి : కేసీఆర్

KCR Road Show ( Image Credit : Google )

KCR Road Show : తెలంగాణలో జగిత్యాల జిల్లాగా ఉండాలంటే నిజామాబాద్, పెద్దపెల్లి, కరీంనగర్ అభ్యర్థులను ఎంపీగా గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. జగిత్యాలలో ఆదివారం (మే 5న) నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో దశబ్దాల కల జగిత్యాల జిల్లా.. అలాంటిది ఈ జిల్లాను ఈ ప్రభుత్వం తీసేస్తాంటుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Read Also : Kangana Ranaut : పాపం కంగనా రనౌత్‌.. పేరుతో తికమక.. సొంత పార్టీ నేతనే తిట్టిపోసింది!

ఈ ప్రాంత రైతుల బాధ నాకు తెలుసునని అన్నారు. వరద కాలువను రీసర్వాయర్‌గా చేసుకుని చెరువులు నింపుకున్నామని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం 5 నెలల్లో వరద కాలువను ఎండబెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.

అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించిందని దుయ్యబట్టారు. అచ్చేదిన్ రాలె కానీ సచ్చే దిన్ వచ్చిందని ఎద్దేవా చేశారు. మోడీ హయంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

సబ్ కా వికాస్ జరగలేదు.. సబ్ కా సత్యనాష్ జరిగింది :
9 ఏళ్లుగా నిర్వీరమంగా వచ్చిన నీళ్లు, కరెంట్ ఎక్కడికి పోయాయని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు గెలిచి 4 రూపాయలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. సబ్ కా వికాస్ జరగలేదు కానీ.. సబ్ కా సత్యనాష్ జరిగిందని విమర్శించారు. ఎంపీ అరవింద్ నిజామాబాదు పార్లమెంట్ పరిదిలో ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలన్నారు.

రాష్ట్రంలో 3 కోట్ల వడ్లు పండించాము కానీ మోదీ కొనలేదని విమర్శించారు. నూకలు తినుమన్న నూకరాజు మోదీ.. అలాంటి మోదీకి ఎందుకు ఓటు వెయ్యాలన్నారు. గోదారి నీళ్లని మోడీ ఎత్తుకపోతే ఈ సీఎం మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మూతి ముడుచుకొని కూర్చుంటారన్న ఆయన జగిత్యాల కవులు, రచయితలు ఆలోచించాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ సెక్యూలర్ పార్టీగా కేసీఆర్ పేర్కొన్నారు.

Read Also : CM Revanth Reddy : చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించండి : రేవంత్ రెడ్డి