Geethanjali Malli Vachindi : ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ఓటీటీకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఎక్కడ?

హారర్ తో పాటు ఫుల్ కామెడీతో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Geethanjali Malli Vachindi : గతంలో అంజలి(Anjali) డ్యూయల్ రోల్ లో వచ్చిన హారర్ కామెడీ ‘గీతాంజలి’ మంచి విజయం సాధించడంతో పదేళ్ల తర్వాత దానికి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాని తెరకెక్కించారు. ఏప్రిల్ 11న ఈ సినిమా థియేటర్లలో రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా అంజలికి 50వ సినిమా కావడం గమనార్హం. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్, అలీ, సత్య, రాహుల్ మహాదేవ్, సునీల్, రవిశంకర్, రవికృష్ణ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Devara Update : ఎన్టీఆర్ అటు ‘వార్ 2’.. ఇటు ‘దేవర’.. దేవర షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

హారర్ తో పాటు ఫుల్ కామెడీతో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ప్రేక్షకులని థియేటర్స్ లో మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఆహా ఓటీటీలో మే 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటించారు. థియేటర్స్ లో ఈ సినిమా మిస్ అయినవాళ్లు ఉంటే ఆహా ఓటీటీలో చూసేయండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా భయపడుతూ, నవ్వుతూ చూసుకోవచ్చు.

 

ఇక గీతాంజలి మళ్ళీ వచ్చింది కథ విషయానికొస్తే.. పార్ట్ 1 చివర్లో వచ్చిన గీతాంజలి(అంజలి) దయ్యం ఇంకా అలాగే ఉంటుంది. పార్ట్ 1లో సినిమా తీసి హిట్ కొట్టిన శ్రీను(శ్రీనివాస్ రెడ్డి)కి సినిమా ఆఫర్ రావడంతో ఊటీ వెళ్తారు. నిర్మాత విష్ణు(రాహుల్ మాధవ్) వీళ్లకు సినిమా ఛాన్స్ ఇచ్చి అంజలి(అంజలి డ్యూయల్ రోల్)నే హీరోయిన్ గా పెట్టాలని, భూత్ బంగ్లా సంగీత్ మహల్ లోనే షూటింగ్ చేయాలని కండిషన్స్ పెడతాడు. ఆ సంగీత్ మహల్ లో శాస్త్రి(రవిశంకర్), ఆయన భార్య(ప్రియా), ఆయన కూతురు దయ్యాలుగా ఉంటారు. సంగీత్ మహల్, ఆ ముగ్గురు దయ్యాల కథేంటి? విష్ణు ఫ్లాప్స్ లో ఉన్న శ్రీనుకి ఎందుకు సినిమా ఛాన్స్ ఇచ్చాడు? అంజలినే హీరోయిన్ గా పెట్టాలని, బూత్ బంగ్లాలోనే షూట్ చేయాలని ఎందుకు కండిషన్ పెట్టాడు? ఆ దయ్యాల మధ్యలో వీళ్ళు సినిమా తీసారా? గీతాంజలి ఆత్మ బయటకి వచ్చిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు