Devara Update : ఎన్టీఆర్ అటు ‘వార్ 2’.. ఇటు ‘దేవర’.. దేవర షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

ఇటీవల ఎన్టీఆర్ ముంబైకి వెళ్లి రెండు వారాలుగా అక్కడ వార్ 2 షూట్ లో పాల్గొంటున్నాడు.

Devara Shooting Update : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర(Devara), వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. దేవర, వార్ 2 సినిమాలు రెండూ కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ ముంబైకి వెళ్లి రెండు వారాలుగా అక్కడ వార్ 2 షూట్ లో పాల్గొంటున్నాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం.

అయితే దేవర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఆల్రెడీ దేవర పార్ట్ 1 సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో ఉన్నా ఎన్టీఆర్ లేని సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. సైఫ్ అలీఖాన్ తో పాటు వేరే ఆర్టిస్టుల కాంబినేషన్ లో ఉన్న సీన్స్ ని చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. దేవర సినిమా కథ ఎక్కువగా సముద్ర తీరాల్లో జరిగే కథ అని గతంలో చెప్పారు కొరటాల. దీంతో మూవీ షూట్ కూడా ఎక్కువగా సముద్ర తీరాల్లోనే చేస్తున్నారు. ఇప్పటివరకు గోవా, గోకర్ణలో షూట్ చేయగా ఇప్పుడు వైజాగ్ లో షూట్ చేస్తున్నారు. త్వరలో అక్కడ వార్ 2 అవ్వగానే ఎన్టీఆర్ ఇక్కడికి వచ్చి దేవర షూట్ లో జాయిన్ అవ్వనున్నారు.

Also Read : Dhanush : ధనుష్ కష్టాలు.. పదిగంటల పాటు డంప్ యార్డ్ లో..

ఇక ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దేవర సినిమాపై ఎన్టీఆర్, కొరటాల శివ అదిరిపోయే సినిమా, ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమా అని చెప్పడం, దేవర రెండు పార్టులు అని ప్రకటించడం, ఆల్రెడీ రిలీజయిన గ్లింప్స్ తో దేవరపై భారీ హైప్ ఏర్పడింది. ఇక ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ సినిమా కావడం, అందులోను యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా, హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ డాన్స్ వేస్తాడని రూమర్స్ రావడంతో వార్ 2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు