OG Movie Next Schedule To Be Shot In Hyderabad
OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజి’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాగా, ఈ సినిమాను అనౌన్స్ చేయగానే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా తొలి షెడ్యూల్‍ను ముంబైలో జరుపుకోగా, రెండో షెడ్యూల్‌ను పూణెలో జరుపుకున్నారు.
OG Movie: ఓజి మూవీలో జాయిన్ అయిన వెర్సటైల్ యాక్టర్.. ఎవరంటే..?
ఇక తాజాగా ఈ చిత్ర రెండో షెడ్యూల్ ముగిసిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఓజి మూవీ మూడో షెడ్యూల్‌ను ఎక్కడ జరుపుకుంటారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే జరుపుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ హైదరాబాద్ షెడ్యూల్‌లో సినిమాలోని కొన్ని కీలక సీన్స్‌ను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
OG Movie: ఓజి నుండి సాలిడ్ అప్డేట్.. ఏమిటో తెలుసా?
కాగా ఈ సినిమాలో పవన్ ఓ నిన్జా వారియర్‌గా కనిపిస్తుండగా, అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా నుండి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.