OG Movie: ఓజి నుండి సాలిడ్ అప్డేట్.. ఏమిటో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ‘ఓజి’ మూవీ రెండో షెడ్యూల్ ను తాజాగా స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్ ను పూణెలో షూట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

OG Movie: ఓజి నుండి సాలిడ్ అప్డేట్.. ఏమిటో తెలుసా?

OG Movie New Schedule From Today

Updated On : April 27, 2023 / 4:35 PM IST

OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ‘ఓజి’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవగా, తొలి షెడ్యూల్‌ను ముంబైలో షూట్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ను కూడా స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

OG Movie: ఓజి మూవీలో పవన్ పాత్ర అలా ఉండబోతుందా..?

ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ఏప్రిల్ 27(నేటి) నుండి పూణెలో మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ షెడ్యూల్‌లో పవన్‌తో పాటు హీరోయిన్ ప్రియాంక కూడా పాల్గొంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ షెడ్యూల్ పది రోజుల పాటు జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ ఓ సరికొత్త పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

OG Movie: షూటింగ్ స్టార్ట్స్.. రికార్డులను పాతరపెట్టేందుకు వస్తోన్న OG..!

ఓజి మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుండి ఓ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమా నుండి అప్డేట్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.