OG Movie: ఓజి మూవీలో పవన్ పాత్ర అలా ఉండబోతుందా..?

పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ మూవీలో పవన్ రోల్ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

OG Movie: ఓజి మూవీలో పవన్ పాత్ర అలా ఉండబోతుందా..?

Buzz On Pawan Kalyan Role In OG Movie

Updated On : April 21, 2023 / 12:49 PM IST

OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘OG’ ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్‌ను ఎలా చెడుగుడు ఆడుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

OG Movie: షూటింగ్ స్టార్ట్స్.. రికార్డులను పాతరపెట్టేందుకు వస్తోన్న OG..!

ఈ సినిమాను పూర్తి గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయతే తాజాగా ఈ సినిమాలో పవన్ పాత్ర ఇలాంటిదే అంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవన్ నింజా తరహా పాత్రలో కనిపిస్తాడట. పూర్తిగా యాక్షన్ చేస్తూ పవన్ మనకు ఈ సినిమాలో కనిపిస్తాడట. అయితే, పవన్ ఈ రేంజ్‌లో యాక్షన్ చేయడానికి ఓ బలమైన కారణం కూడా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆ కారణం ఏమిటనేది మనకు సినిమాలో చాలా ఎమోషనల్‌గా చూపించేందుకు సుజిత్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట.

OG Movie: పవన్ కోసం ఆ టైటిల్‌నే ఫిక్స్ చేసిన సుజిత్..?

ఇక ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్‌తో చిత్ర యూనిట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేయాలని ఓజి టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.