NTR : వామ్మో.. ఈ అమ్మాయి గీసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా ?

ఇటీవల బ్యులా రూబీ పెన్సిల్ తో ఎన్టీఆర్ స్కెచ్ గీసింది. వైరల్ అవ్వడంతో ఓ ఎన్టీఆర్ అభిమాని తనకు మెసేజ్ చేసి దాన్ని కొనుక్కున్నాడు.(NTR)

NTR : వామ్మో.. ఈ అమ్మాయి గీసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా ?

NTR

Updated On : September 4, 2025 / 5:28 PM IST

NTR : టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ సినిమాలు తీస్తున్నారు. ఇటీవల వార్ 2 అనే బాలీవుడ్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. వార్ 2 సమయంలో ఎన్టీఆర్ బాగా వైరల్ అయ్యారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్, ఆయన ఫ్యాన్స్ వైరల్ అవుతున్నారు. ఒక స్కెచ్ ఆర్టిస్ట్ గీసిన ఎన్టీఆర్ బొమ్మను ఫ్యాన్స్ భారీ ధరకు కొనుక్కున్నారు.

బ్యులా రూబీ అనే తెలుగు అమ్మాయి పెన్సిల్స్ తో స్కెచ్ ఆర్ట్ లు గీస్తూ ఉంటుంది. వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసి అమ్ముతుంటుంది. లేదా ఎవరికైనా తన స్కెచ్ లు నచ్చితే కొనుక్కుంటారు. తను సినిమా హీరోలు, సెలబ్రిటీల స్కెచ్ లు గీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Also Read : GST on Movie Tickets : కొత్త జీఎస్టీ ఎఫెక్ట్.. సినీ పరిశ్రమకు వరం.. రేట్లు తగ్గినట్టే..?

ఇటీవల బ్యులా రూబీ పెన్సిల్ తో ఎన్టీఆర్ స్కెచ్ గీసింది. ఈ ఫోటో వైరల్ అవ్వడంతో ఓ ఎన్టీఆర్ అభిమాని అమెరికా నుంచి తనకు మెసేజ్ చేసి దాన్ని కొనుక్కున్నాడు. ఈ విషయాన్ని బ్యులా రూబీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

బ్యులా రూబీ ఈ విషయాన్ని తెలియచేస్తూ.. ఇప్పటివరకు నేను గీసిన తెలుగు హీరోలకు సంబంధించిన పెన్సిల్ ఆర్ట్ లో ఎన్టీఆర్ ఆర్ట్ ఎక్కువ రేటుకు అమ్ముడయింది. ఓ వ్యక్తి నాకు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి దీన్ని కొనుక్కున్నాడు. 1650 డాలర్లు అంటే ఆల్మోస్ట్ లక్ష 45 వేల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. నేను గీసిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. నా పెన్సిల్ ఆర్ట్ ఇంతకు అమ్ముడవుతుందని నేను అనుకోలేదు అంటూ తెలిపింది. దీంతో ఈ ఆర్ట్ వైరల్ అవ్వగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్కెచ్ అదిరింది అంటూ అభినందిస్తున్నారు.

Also Read : Coolie Ott Release : ర‌జినీకాంత్ కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌.. ఎప్ప‌టినుంచంటే..?