Coolie Ott Release : రజినీకాంత్ కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన మూవీ కూలీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ (Coolie Ott Release) ఫిక్సైంది.

Rajinikanth Coolie Ott Release date fix
Coolie Ott Release : లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన మూవీ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు.
ఆమీర్ ఖాన్, శృతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, పూజాహెగ్డే, సత్యరాజ్.. లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Alcohol Teaser : ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్..
View this post on Instagram
ఈ చిత్రం బాక్సాఫీజ్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇక ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇది. ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ (Coolie Ott Release) ఫిక్సైంది. సెప్టెంబర్ 11న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.