Alcohol Teaser : ఆక‌ట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్క‌హాల్’ టీజ‌ర్‌..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ న‌టిస్తున్న చిత్రం ఆల్క‌హాల్‌. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌(Alcohol Teaser)ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

Alcohol Teaser : ఆక‌ట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్క‌హాల్’ టీజ‌ర్‌..

Allari Naresh Alcohol Teaser out now

Updated On : September 4, 2025 / 11:41 AM IST

Alcohol Teaser : టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ న‌టిస్తున్న చిత్రం ఆల్క‌హాల్‌. మెహర్ తేజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అల్ల‌రి న‌రేశ్ కెరీర్‌లో 63వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో రుహాని శర్మ కథానాయికగా న‌టిస్తోంది. గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌(Alcohol Teaser)ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ల‌క్ష‌లు ల‌క్ష‌లు సంపాదిస్తావు కానీ మందు తాగ‌వు.. ఇంకా ఎందుకు నీ బ‌తుకు అని స‌త్య చెప్పే డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది.

Ghaati release glimpse : అనుష్క ‘ఘాటి’ రిలీజ్ గ్లింప్స్ వ‌చ్చేసింది.. ప్ర‌భాస్ చేతుల మీదుగా..

‘తాగుడికి సంపాద‌న‌కు లింకే ముంది’. ‘తాగితే ఆల్క‌హాల్ న‌న్ను కంట్రోల్ చేస్తుంది. అది నాకు న‌చ్చ‌దు.’ అని న‌రేశ్ చెప్పే డైలాగ్‌లు బాగున్నాయి. మొత్తంగా టీజ‌ర్ అదిరిపోయింది. టీజ‌ర్ చూస్తుంటే ఈ చిత్రం కామెడీ ప్ర‌ధానంగా ఉండ‌నున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జ‌న‌వ‌రి 1న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.