Pawan Kalyan Dual Role : ఓజీలో పవన్ డబుల్ రోల్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ డబుల్ రోల్‌లో (Pawan Kalyan Dual Role) కనిపించబోతున్నారని టాక్‌ వినిస్తోంది.

Pawan Kalyan Dual Role : ఓజీలో పవన్ డబుల్ రోల్?

Gossip Garage Pawan Kalyan Dual Role In OG Movie

Updated On : September 4, 2025 / 6:06 PM IST

Pawan Kalyan Dual Role : పవన్ క‌ళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో పవన్ డబుల్ రోల్‌లో (Pawan Kalyan Dual Role) కనిపించబోతున్నారని టాక్‌ వినిస్తోంది. పవన్ ఇప్పటివరకు తన కెరీర్‌లో డబుల్ రోల్ చేయలేదు.

కానీ ఈ సినిమాతో ఆయన తన అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారట. పవన్‌ యాక్ట్ చేస్తున్న డబుల్ రోల్‌ చాలా పవర్‌ ఫుల్‌గా ఉంటాయని, ఒకటి గ్యాంగ్‌స్టర్ ఒజస్ గంభీరగా, మరొకటి ఊహించని ట్విస్ట్‌తో కనిపిస్తుందని అంటున్నారు. ఈ విషయం ఫ్యాన్స్‌లో హైప్‌ను మరింత పెంచేస్తోంది.

GST on Movie Tickets : కొత్త జీఎస్టీ ఎఫెక్ట్.. సినీ పరిశ్రమకు వరం.. రేట్లు తగ్గినట్టే..?

సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, శ్రియారెడ్డి లాంటి స్టార్ కాస్ట్ ఉంది. పైగా ఈ డబుల్ రోల్ టాక్ నిజమైతే, ఓజీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

పవన్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో ఓజీ సినిమా షూటింగ్ కొంత ఆలస్యంగా పూర్తైంది. ఇప్పుడు సినిమా వర్క్ స్పీడ్‌గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్‌ డబుల్ రోల్ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, సినిమా యూనిట్ నుంచి వస్తున్న లీక్స్ ఈ గాసిప్‌కు బలం చేకూరుస్తున్నాయి.

Coolie Ott Release : ర‌జినీకాంత్ కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌.. ఎప్ప‌టినుంచంటే..?

రెండు పాత్రల్లో పవన్ వైవిధ్యమైన నటన, ఒక రౌద్రమైన గ్యాంగ్‌స్టర్‌గా, మరొకటి ఎమోషనల్ డెప్త్‌తో కూడిన పాత్రగా ఉంటుందని అంటున్నారు. థమన్ సంగీతం, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీతో ఈ సినిమా విజువల్‌గా కూడా గ్రాండ్‌గా ఉంటుందని, పవన్ డబుల్ రోల్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.