OG Movie: షూటింగ్ స్టార్ట్స్.. రికార్డులను పాతరపెట్టేందుకు వస్తోన్న OG..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ OG మూవీ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్‌ను ఇవాళ స్టార్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

OG Movie: షూటింగ్ స్టార్ట్స్.. రికార్డులను పాతరపెట్టేందుకు వస్తోన్న OG..!

Pawan Kalyan OG Movie Shooting Starts With A Bang

OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజి అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ, ఈ సినిమా నుండి ఒక్క అప్డేట్ ఇవ్వాల్సిందిగా అభిమానులు కోరుతూ వచ్చారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఓ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అయితే చిత్ర యూనిట్ రివీల్ చేసింది.

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ OG రెగ్యులర్ షూట్‌ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?

దర్శకుడు సుజిత్ రాసుకున్న పవర్‌ఫుల్ కథలో అంతకంటే పవర్‌ఫుల్‌గా తన హీరోను చూపెట్టేందుకు ఓజి(OG) మూవీని ఎంచుకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఇవాళ స్టార్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ షూటింగ్‌ను ముంబైలో స్టార్ట్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే అర్థం వచ్చేలా ఈ సినిమాకు OG అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. గ్యాంగ్‌స్టర్స్, మాఫియా చుట్టూ ఈ కథ సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Pawan Kalyan OG : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సుజిత్.. OG Is Coming!

ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో పవన్ వచ్చే వారంలో జాయిన్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను సుజిత్ ఎంత ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాగా, ఈ సినిమాలో మిగతా నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ఇవ్వనుండగా, డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.