Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ OG రెగ్యులర్ షూట్‌ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?

పవన్ కళ్యాణ్, సుజిత్ కలయికలో వస్తున్న OG సినిమా పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ OG రెగ్యులర్ షూట్‌ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?

Pawan Kalyan OG regular shoot commence on april 16

Pawan Kalyan OG : పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ లో ఉన్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఆడియన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీతో పాటు OG చిత్రం పై కూడా ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. సాహూ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంతో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న మూవీ టీం ఇటీవల లొకేషన్స్ కూడా ఫైనల్ చేసేంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూట్ కూడా డేట్ ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది.

Pawan Kalyan: వీరమల్లు బ్యాక్ టు యాక్షన్.. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో దిగుతున్న పవన్..?

ఈ ఆదివారం (ఏప్రిల్ 16) నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కనుందట. ముంబైలో ఈ మూవీ షూటింగ్ చోటు చేసుకోనుంది. కాగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా ఎంపిక అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ నుంచి ఈ వార్త పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతుంది. సాహూ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అండ్ స్టైలిష్ స్క్రీన్ ప్లే టేకింగ్ తో ఆడియన్స్ ని సుజిత్ బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.

కాగా పవన్ నటిస్తున్న మరో చిత్రం హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu). పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. మే మూడో వారం నుంచి పవన్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యి బ్యాలన్స్ షూట్ మొత్తం పూర్తి చేయనున్నాడని సమాచారం. ఇది ఇలా ఉంటే, పవన్ ఆల్రెడీ వినోదయ సిత్తం రీమేక్ పూర్తి చేశాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది పవన్ నుంచి ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.