Power Cut: వీడెవడండీ బాబూ..! లవర్ ఫోన్ బిజీ వస్తోందని.. ఆ ఊరి మొత్తానికి కరెంట్ కట్ చేశాడు..
గర్ల్ ఫ్రెండ్ పై కోపంతో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆ ఊరి ప్రజలు అందరినీ ఇబ్బంది పెట్టాడు. గ్రామంలో చీకట్లు మగ్గేలా చేశాడు.

Power Cut: తాను ప్రేమించిన అమ్మాయి ఫోన్ బిజీగా వస్తోందని ఓ యువకుడు చేసిన నిర్వాకం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ వ్యక్తి చేసిన పిచ్చి పనికి నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు. ఇంతకీ అతగాడు ఏం చేశాడో తెలుసా.. ప్రియురాలి గ్రామం మొత్తానికి కరెంట్ కట్ చేశాడు.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ అని రావడంతో..
ఓ వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ క్రమంలో లవర్ తో మాట్లాడేందుకు ఆమెకు ఫోన్ చేశాడు. అయితే ఫోన్ బిజీ అని వచ్చింది. ఆమెతో మాట్లాడాలని అతడు చాలా సార్లు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ బిజీ అని వచ్చింది. అంతే మనోడిలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ ఆవేశంలో కరెంట్ పోల్ ఎక్కేశాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న పెద్ద కత్తెర లాంటి వస్తువుతో కరెంట్ వైర్లు కట్ చేశాడు. ప్రియురాలి గ్రామానికి వెళ్లే విద్యుత్ వైర్లను సెలెక్ట్ చేసుకుని మరీ కత్తిరించేశాడు. అలా ఆ అమ్మాయి నివాసం ఉంటున్న ఊరి మొత్తానికి కరెంట్ లేకుండా చేశాడు. ఆ ఊరిని అంధకారంలోకి నెట్టేశాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వ్యక్తి చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. వీడెవడండీ బాబూ అని నోరెళ్లబెడుతున్నారు.
అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
ఆ వ్యక్తి చేసిన పనితో గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రియురాలి ఫోన్ బిజీ వస్తే.. ఊరి మొత్తానికి కరెంట్ కట్ చేయడం ఏంటని సీరియస్ అవుతున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక నెటిజన్లు సైతం అతడు చేసిన పనిని తప్పుపడుతున్నారు. ఇలా చేయడం ఎంతమాత్రమూ కరెక్ట్ కాదంటున్నారు. ”అది టెలిఫోన్ లైన్ కాదు, ఆమె ల్యాండ్ లైన్ వాడటం లేదు.. ముందు ఆ విషయం తెలుసుకో.. అందుకే చదువు ముఖ్యం అని చెప్పేది” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
”ఇకనైనా బాలీవుడ్ సినిమాలు చూడటం మానేయ్” అని మరొక నెటిజన్ సూచించాడు. ‘ఇది చాలా ప్రమాదకమైన చర్య. కరెంట్ పోల్ ఎక్కడం ప్రాణాలకే ప్రమాదం. ఏ మాత్రం తేడా జరిగినా కరెంట్ షాక్ కొట్టి చనిపోయేవాడివి’ అని ఇంకొక నెటిజన్ హెచ్చరించాడు.
Also Read: కొత్త జీఎస్టీ రేట్ల ఎఫెక్ట్.. మద్యం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
अरे भाई, प्यार में इंसान क्या-क्या नहीं करता है
ये भाई साहब अपनी गर्लफ्रेंड के व्यस्त फोन पर इतना नाराज हुआ
कि पूरे गांव की बिजली काट दी। pic.twitter.com/63rS0FlqeF
— Anand Yadav (Sonu) (@yadavsonuanand) August 31, 2025