New GST Rates : కొత్త జీఎస్టీ రేట్ల ఎఫెక్ట్.. మద్యం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?

GST Rates : సామాన్యులపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేలా జీఎస్టీ స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు చేసింది.

New GST Rates : కొత్త జీఎస్టీ రేట్ల ఎఫెక్ట్.. మద్యం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?

GST Rates

Updated On : September 4, 2025 / 1:44 PM IST

GST Rates : సామాన్యులపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేలా జీఎస్టీ స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై జీఎస్టీలో రెండు శ్లాబులు (5శాతం, 18శాతం) మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో 12, 28శాతం స్లాబ్ లు తొలగించాలని నిర్ణయించారు.

Also Read: GST Rate Cement cut: కొత్త GST రేట్లు.. 18శాతం శ్లాబులోకి సిమెంట్.. ఇళ్ల రేట్లు భారీగా తగ్గే చాన్స్..

జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా.. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు కేవలం 5శాతం, 18 శాతంతో రెండు శ్లాబుల విధానాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ శ్లాబుల ప్రకారం.. కొన్ని వస్తువులు, వాహనాల ధరలు తగ్గనుండగా.. మరికొన్ని వస్తువులు, వాహనాల ధరలు పెరగనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచే కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. అయితే, తాజాగా జీఎస్టీ సంస్కరణల ఎఫెక్ట్ మద్యం ధరలపై పడుతుందా..? మద్యం ధరలు తగ్గుతాయా.. పెరుగుతాయా అనే విషయాలు తెలుసుకుందాం.

మద్యంపై జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఉండదు. ఎందుకంటే మద్యం జీఎస్టీ పరిధిలోకి రాదు. అయితే, మద్యం తయారీకి సంబంధించిన ఉత్పత్తులపై వివిధ రకాల పన్ను విధించబడుతుంది. తాజా జీఎస్టీ శ్లాబుల మార్పుల్లో భాగంగా.. సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు, గుట్కా తదితర వాటిపై మునుపటి 28శాతం శ్లాబు నుంచి 40శాతం పన్నుకు మార్చారు. దీంతో వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పొగాకు ఉత్పత్తులతోపాటు ఆరోగ్యానికి హానికరం కలిగించే ఉత్పత్తులు అని పేర్కొనేలా వాటి బ్రాండ్ పైనే పేర్లను ఏర్పాటు చేయాలని సిన్ గూడ్స్ పేరిట ఒక ప్రత్యేకమైన కేటగిరీని నిర్ణయించింది. అయితే, అల్కాహాల్ కూడా సిన్ గూడ్స్ కేటగిరీలోకి వస్తాయి. కానీ వీటిపైన ఎలాంటి జీఎస్టీ పన్ను ఉండదు.

Also Read: New GST bikes Prices : కొత్త GST రేట్ల ఎఫెక్ట్.. ఏయే బైక్ ధరలు తగ్గుతాయి.. ఏయేవి పెరుగుతాయి?

రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యంపై వచ్చే ఆదాయం అత్యంత ముఖ్యమైంది. అనేక రాష్ట్రాల్లో మద్యం నుంచి వచ్చే ఎక్సైజ్ సుంకాలు ప్రభుత్వ ఆదాయంలో 15శాతం నుంచి 25శాతం వరకు ఉంటాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసం ఖర్చు చేసే నిధుల్లో మద్యం నుంచి వచ్చే ఆదాయం ప్రధాన వనరుగా ఉంటుంది. మద్యంను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రాల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2017లో జీఎస్టీ విధానాన్ని ప్రారంభించినప్పుడు మద్యంను జీఎస్టీలో చేర్చే విషయంపై అనేక చర్చలు జరిపింది. కానీ, ఆ విషయంపై వెనక్కి తగ్గింది. ఆల్కహాల్ అలాగే ఇతర ఉత్పత్తుల పైన జీఎస్టీ స్థానంలో VAT (వ్యాల్యూ ఆడెడ్ టాక్స్) అమల్లో ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. అలాగే ఎక్సైజ్ డ్యూటీ కూడా విధిస్తారు.

మద్యంతోపాటు పెట్రోలియం ముడి చమురు, మోటార్ స్పిరిట్ (పెట్రోల్), హైస్పీడ్ డీజిల్, సహజ వాయువు, విమాన టర్బైన్ ఇంధనం వంటి పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రావు. అయితే, పెట్రోల్, డీజిట్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ప్రత్యేక పన్నులు ఉంటాయి. తాజా పండ్లు, కూరగాయల విక్రయం, రైతుల నుంచి కొనుగోలు చేసి, ఎలాంటి ప్రాసెస్ చేయకుండా విక్రయించే వస్తువులకు జీఎస్టీ వర్తించదు.