OG Movie: ఓజి మూవీలో జాయిన్ అయిన వెర్సటైల్ యాక్టర్.. ఎవరంటే..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజి మూవీలో వెర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Prakash Raj Joins OG Movie Shooting
OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై సాలిడ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
OG Movie: ఓజి నుండి సాలిడ్ అప్డేట్.. ఏమిటో తెలుసా?
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని, ఇటీవల రెండో షెడ్యూల్‌ను కూడా స్టార్ట్ చేశారు. ఈ రెండో షెడ్యూల్‌లో ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా జాయిన్ అయినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఓ కీలక పాత్రలో ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో నటిస్తున్నాడని.. పవన్‌తో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్ వెల్లడించింది.
OG Movie: ఓజి మూవీలో పవన్ పాత్ర అలా ఉండబోతుందా..?
ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
.@prakashraaj joins the sets of @PawanKalyan’s #OG today!
Crucial scenes are currently being shot in Mumbai…? #TheyCallHimOG.
— DVV Entertainment (@DVVMovies) April 28, 2023